ముంబైకి సెంటిమెంట్: విజేతపై గణాంకాలు ఏం చెబుతున్నాయి?
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ తుది పోరుకు వేదిక కానుంది.
ఈ సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పూణె వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైని ఓ సెంటిమెంట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ పదో సీజన్లో పూణె చేతిలో మూడు సార్లు ముంబై ఓటమిపాలైంది. 2011 ఐపీఎల్ సీజన్ తర్వాత టాప్ రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టే ఐపీఎల్ విజేతగా నిలవడం ముంబైపై ఒత్తిడి పెంచుతోంది.

14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌ల్లో విజయం
లీగ్ దశలో 14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం చెందిన ముంబై రెండు సార్లు పూణె చేతిలోనే ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును నిద్రలేకుండా చేస్తోంది. క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కూడా ముంబై.. పూణె చేతిలోనే ఓటమిపాలడవం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.

లీగ్ దశలో రెండో స్ధానంలో పూణె
అంతేకాదు లీగ్ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పూణె తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబై ఫైనల్‌లో ఓటమి పాలవడం ఖాయమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

రెండు సార్లు విజేతగా ముంబై
2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), బెంగళూరు(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), చెన్నై సూపర్ కింగ్స్(1) తలపడగా ముంబై టైటిల్ విజేతగా అవతరించింది. 2014లో పంజాబ్(1)పై కోల్‌కతా (2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి రెండో సారి ఐపీఎల్ విజేతగా అవతిరించింది. ఐపీఎల్‌లో ముంబై విజయం సాధించిన రెండు సార్లు కూడా లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలవడం విశేషం.

2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలు:
2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (1) - విజేత చెన్నై
2012: కోల్‌కతా నైట్ రైడర్స్(2) X చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కోల్‌కతా
2013: ముంబై ఇండియన్స్(2) X చెన్నై సూపర్ కింగ్స్ (1) - విజేత ముంబై
2014: కోల్‌కతా నైట్ రైడర్స్(2) X కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కోల్‌కతా
2015: ముంబై(2) X చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై
2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2) X సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్
2017: రైజింగ్ పూణె సూపర్ జెయింట్(2) X ముంబై ఇండియన్స్ (1) - విజేత ?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications