For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians: భారీ సిక్సర్ మాత్రమే కాదు.. స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన రోహిత్ (వీడియో)

Mumbai Indians Skipper Rohit Sharma takes one handed Catch During Training Session

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. లీగ్ మొదలు కావడానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. తాజాగా ముంబై ఆటగాళ్ల ప్రాక్టీస్‌ వీడియోలను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేసింది. మొన్న బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా సిక్సులతో రెచ్చిపోయిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌.. తాజాగా తనలోని ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాడు.

డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన రోహిత్‌:

డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన రోహిత్‌:

ప్రాక్టీస్‌ సందర్భంగా మొదటి రెండు బంతులను సాదాసీదాగా అందుకున్న రోహిత్‌ శర్మ.. మూడో బంతిని మాత్రం ఎడమ పక్కకు ఒరిగి ఒంటి చేత్తో డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కోచ్ మహేళ జయవర్ధనే ఆధ్వర్యంలో ముంబై ఆటగాళ్లు సాధన చేశారు. ఈ క్రమంలో కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు తనలో మంచి ఫీల్డర్‌ ఉన్నాడని రోహిత్‌ నిరూపించుకున్నాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

 95 మీట‌ర్ల భారీ సిక్సర్:

95 మీట‌ర్ల భారీ సిక్సర్:

రెండు రోజుల క్రితం టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భారీ సిక్సర్ బాదాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్న రోహిత్.. స్పిన్న‌ర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మ‌లిచాడు. 95 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి.. స్టేడియం బ‌య‌ట రోడ్డు మీద వెళ్తున్న బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది. దీంతో బౌలింగ్ వేసిన స్పిన్న‌ర్ ఒక్కసారిగా ఆచ్చర్యపోయాడు. దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేప‌ట్టిన రోహిత్.. బారీ షాట్ల‌తో విరుచుకుపడ్డాడు.

 మలింగ లేకున్నా:

మలింగ లేకున్నా:

లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఏకంగా నాలుగు సార్లు ఈ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈసారి కూడా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉంది. లీగ్‌లో ఉన్న ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న ముంబైకి వ్యక్తిగత కారణాలతో స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ దూరం కావడం కొంచెం ఇబ్బందిగా మారొచ్చు. అయితే బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ మెక్లీన్‌గన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కౌల్టర్‌ నైల్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉన్నారు.

బ్యాటింగ్‌ విభాగం బలంగానే:

బ్యాటింగ్‌ విభాగం బలంగానే:

రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు క్రిస్ ‌లిన్‌, క్వింటాన్‌ డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో బ్యాటింగ్‌ విభాగం బలంగానే ఉంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌లు జట్టులో ఉండటం అదనపు బలం.

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్ జాంటీ.. అతడికే క్యాచ్‌లు నేర్పిస్తున్న మయాంక్‌ (వీడియో)

Story first published: Saturday, September 12, 2020, 18:12 [IST]
Other articles published on Sep 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+