
నైపుణ్యానికే ప్రాధాన్యతనిస్తూ.. మిగిలిన వారిని
కొన్నేళ్ల పాటుగా ముంబై ఇండియన్స్ నైపుణ్యానికే ప్రాధాన్యతనిస్తూ.. మిగిలిన వారిని పక్కకు నెట్టేస్తుంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మయాంక్ మార్కండే, ఆదిత్యా తారె, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లతో ఏళ్ల తరబడి ప్రయాణం కొనసాగిస్తోంది.

అనుభవం, యువ ఆవేశాన్ని సమన్వయం
అనుభవం, యువ ఆవేశం ప్లేయర్లను సమన్వయం చేసేందుకు కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, ఎవిన్ లూయీస్, మిచెల్ క్లెంగన్, ఆదమ్ మిల్నెలను రిటైన్ జాబితాలో అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీ20స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ జాసన్ బెహ్రెనడార్ఫ్‌ను కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాడు.

డుమినిను ఐపీఎల్ 2018కి ముందే
ఐపీఎల్ వేలంలో జట్టు కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ జీన్ పాల్ డుమినిను ఐపీఎల్ 2018కి ముందే విడుదల చేసేసింది. డుమినితో పాటుగా పాట్ కమిన్స్‌ను, బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహమాన్, శ్రీలంక ఫేసర్ అకిల ధనంజయలను సైతం వదిలేసింది. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన జాబితాలో ముంబై ఇండియన్స్ సౌరవ్ తివారీ, ప్రదీప్ సంగ్వాన్, శరద్ లుంబా, తేజిందర్ సింగ్ దిల్లాన్, యూపీ పేసర్ మోసిన్ ఖాన్, (కేరళ) నిదీశ్‌లను విడుదల చేస్తూ జాబితాను ప్రకటించింది.

మొత్తం ఆటగాళ్లు వీరే
రిటైన్డ్ ప్లేయర్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సిద్ధేశ్ లాడ్, ఆదిత్య తారె, క్వింటన్ డి కాక్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, మిచెల్ మెక్‌క్లెంగన్, ఆదమ్ మిల్నె, జాసన్ బెహ్‌రెన్‌డార్ఫ్
రిలీజ్డ్ ప్లేయర్లు: సౌరబ్ తివారీ, ప్రదీప్ సంగ్వాన్, మోహ్‌సీన్ ఖాన్, నిదీశ్, శరద్ లుంబా, తేజిందర్ సింగ్ దిల్లాన్, జేపీ డుమిని, పాట్ కమిన్స్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అకిల ధనంజయ


Click it and Unblock the Notifications













