Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్‌కు మరో షాక్.. ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం!

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఏదీ కలిసిరావట్లేదు. కెరీర్, వ్యక్తిగత జీవితాల్లో అతనికి కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అనంతరం భారత జట్టు బాధ్యతలు అందుకుంటానని భావించిన హార్దిక్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కాదు కదా, కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా నియమించలేదు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌కు సారథి బాధ్యతలు ఇచ్చింది.

మరోవైపు వన్డే జట్టులో రావడానికి హార్దిక్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి వచ్చింది. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉందని దేశవాళీ క్రికెట్‌లో అతను నిరూపించాల్సి ఉంది. మరోవైపు తన వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తన భార్య నటాషాతో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఈ స్టార్ ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు.

Mumbai Indians Reportedly Eyeing Captaincy Shift from Hardik Pandya Sources

అయితే హార్దిక్‌కు ముంబై ఇండియన్స్‌ కూడా షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉందని సమాచారం. భారత భవిష్యత్ కెప్టెన్‌ అవుతాడని భావించి రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ను సారథిగా ముంబై యాజమాన్యం నియమించిన విషయం తెలిసిందే. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను కాదని ఈ సీజన్‌లో హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. కానీ బీసీసీఐ ప్రణాళికల్లో హార్దిక్ సారథిగా లేడని స్పష్టత రావడంతో, ముంబై ఫ్రాంచైజీ యూటర్న్ తీసుకోనుంది.

ముంబై ఇండియన్స్‌ కూడా కొత్త సారథిని ఎంచుకునే పనిలో నిమగ్నమైంది. 37 ఏళ్ల రోహిత్ శర్మ మరికొన్ని సీజన్లకే అందుబాటులో ఉంటాడు. దీంతో రోహిత్‌ను తిరిగి కెప్టెన్‌‌గా చేయకుండా సూర్య‌కుమార్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్‌ను మాత్రం జట్టులోనే కొనసాగించాలనుకుంటుంది. గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపిన హార్దిక్ ముంబై తరఫున తడబడ్డాడు. 2024 సీజన్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. అంతేగాక పాయింట్ల పట్టికలో అట్టడుగన ముంబై నిలిచింది.

ప్రస్తుతం ముంబై జట్టులో హార్దిక్‌తో పాటు భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ ఉన్నారు. వచ్చే ఏడాది మెగా వేలం ఉండటంతో గత రిటైన్డ్ నిబంధనల ఆధారంగా నలుగురు ఆటగాళ్లను ముంబై అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. రైట్ టూ మ్యాచ్ కార్డ్‌‌తో మరో ప్లేయర్‌ను తమ ఫ్రాంచైజీతోనే ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది.

Story first published: Saturday, July 20, 2024, 8:04 [IST]
Other articles published on Jul 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+