ముంబై ఇండియన్స్‌లో 'కెప్టెన్సీ మార్పు' వివాదం ఇంకా సద్దుమణగలేదని తెలుస్తోంది. నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యను విమర్శిస్తూ రోహిత్ శర్మకు సపోర్ట్ చేసే గ్రూప్‌లో తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ జాయిన్ అయ్యాడు. హార్దిక్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ నబీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశాడు.
అసలేం జరిగిదంటే.. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో, 7x4, 3x6) అర్ధశతకంతో చెలరేగాడు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో, 2x4, 7x6), శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో, 2x4, 3x6) పోరాడారు. బుమ్రా మూడు వికెట్లతో మెరిశాడు. అయితే పంజాబ్ ఛేజింగ్‌లో మహ్మద్ నబీకి హార్దిక్ బంతి అందివ్వలేదు. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్న స్పిన్నర్ శ్రేయస్ గోపాల్, పేసర్ ఆకాశ్ మద్వాల్‌కు మాత్రం హార్దిక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. కానీ నబీకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు.
అయితే దీనిపై ఓ అఫ్గానిస్థాన్ క్రికెట్ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ను విమర్శిస్తూ పోస్ట్ చేశాడు. 'ముంబై ఇండియన్స్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం వింతగా అనిపించింది. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పంజాబ్ మ్యాచ్‌లో నబీ బౌలింగే చేయలేదు. అయితే నబీ గేమ్ ఛేంజర్. కీలక సమయంలో రెండు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్ చేశాడు' అని పోస్ట్ పెట్టాడు. దాన్ని నబీ తన ఫ్రొఫైల్‌లో షేర్ చేస్తూ స్టోరీ పెట్టడం గమనార్హం.
నబీ పోస్ట్‌తో చర్చ మొదలైంది. ముంబై జట్టులో రోహిత్-హార్దిక్ గ్రూప్‌లు ఉన్నాయని స్పష్టమవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను కాదని హార్దిక్‌కు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అందించిన సంగతి తెలిసిందే. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, తిలక్ వర్మలకు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని కథనాలు వచ్చాయి. తాజా పోస్ట్‌తో రోహిత్ బ్యాచ్‌లో నబీ కూడా చేరాడని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.