IPL 2022: ఆర్‌‌సీబీ కెప్టెన్ రేసులో ఆ నలుగురు! అన్నీ కుదిరితే ఆ ముంబై స్టారే కోహ్లీ వారుసుడు!

RCB Captain In IPL 2022 : 4 Players In Race | IPL 2021, RCB VS KKR || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన విరాట్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనకు చివరిదని, ఆ తర్వాత ఆటగాడిగానే జట్టులో కొనసాగుతానని ఆదివారం వెల్లడించాడు. 'ఆర్‌సీబీ కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్. ఎంతో ఆలోచించి టీమ్ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. గతంలో చెప్పినట్లుగానే నా చివరి ఐపీఎల్ మ్యాచ్‌ వరకు ఆర్‌సీబీలో ప్లేయర్‌గా కొనసాగుతా.

చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లున్న ఆర్‌సీబీ జట్టును కెప్టెన్‌గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ అవకాశం నాకిచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లందరికి ధన్యవాదాలు. నాపై నమ్మకంతో నాకు మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయంతో ఆర్‌సీబీకి కొత్త తలనొప్పి ప్రారంభమైంది. ఈ సీజన్ సాఫిగా సాగినా.. వచ్చే సీజన్‌కు కెప్టెన్‌ను ఎత్తుకునే పరిస్థితి ఆ జట్టుకు కలిగింది. మెగా నేపథ్యంలో ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆర్‌సీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ అసలు సిసలు కెప్టెన్ కోసం ఇప్పుటి నుంచి ప్రణాళికలు రచించనుంది. కోహ్లీ వారుసుడిగా ఆర్‌సీబీ కెప్టెన్ రేసులో ఓ నలుగురు ప్లేయర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఓ లుక్కెద్దాం.

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం కష్టం. రిటైన్ పాలసీ ప్రకారం ఇద్దరు స్వదేశీ, మరో ఇద్దరు విదేశీ లేదా ముగ్గురు స్వదేశీ, మరోకరు విదేశీ ఆటగాళ్లతో మొత్తం నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో ముంబై ఇండియన్స్ టీమ్ సూర్యకుమార్‌ను చేజార్చుకోనుంది.

ముంబై జట్టును సూర్యవీడితే మాత్రం మెగా వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడనున్నాయి. ఇక ఆర్‌సీబీ కూడా తమ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునేందుకు ఎంతకైన తెగిస్తుంది. సూర్యకు కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేకపోయినా.. దేశవాళీలో ముంబై జట్టును నడిపించాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అయ్యాడు. ఇదే జోరు కొనసాగిస్తే ఈ ఆటగాడిపై కోట్లు కుమ్మరించేందుకు ఆర్‌సీబీ సిద్దంగా ఉంటుంది.

క్వింటన్ డికాక్

క్వింటన్ డికాక్

ముంబై ఇండియన్స్‌కే చెందిన మరో ప్లేయర్ క్వింటన్ డికాక్ కోసం కూడా ఆర్‌సీబీ ప్రయత్నాలు చేయవచ్చు. అతన్ని గనుక ముంబై వేలంలోకి వదిలితే ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడనున్నాయి. ముంబై తమ ట్రంప్ కార్డు ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. కాబట్టి క్వింటన్ డికాక్ కచ్చితంగా వేలంలోకి రానున్నాడు. సౌతాఫ్రికా జట్టును నడిపించిన అనుభవం ఉన్న డికాక్ కోసం ఆర్‌సీబీ ఎంతకైనా తెగిస్తోంది.

గ్లేన్ మ్యాక్స్‌వెల్

గ్లేన్ మ్యాక్స్‌వెల్

ఇక ఆర్‌సీబీ టీమ్‌లో ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు సారథ్య బాధ్యతలు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్ వేలంతోనే ఆర్‌సీబీలోకి అడుగుపెట్టిన మ్యాక్సీ.. భారత్ వేదికగా జరిగిన లీగ్‌లో దుమ్మురేపాడు. 7 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 223 పరుగులు చేశాడు. యూఏఈ గడ్డపై కూడా అతను ఇదే జోరు కనబరిస్తే ఆర్‌సీబీ టీమ్‌కు తిరుగుండదు. అయితే సెకండాఫ్‌లో రాణించడంపైనే అతని రిటైన్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అద్భుతంగా ఆడితే మాత్రం రిటైన్ చేసుకొని కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టపెట్టవచ్చు. బీబీఎల్‌లో అతను కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆ అనుభవం కూడా పరిగణలోకి రానుంది.

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్‌లో కూడా ఆడితే అతనికే ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి. గత కొన్నేళ్లుగా జట్టుతో ఉన్న అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తన ఆటలో మాత్రం ఏం తేడాలేదు. ప్రతీ సీజన్‌లో ఏబీడీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూనే ఉన్నాడు. అయితే అతను వచ్చే సీజన్‌లో ఆడటం కష్టమే. ఆడితే మాత్రం ఆర్‌సీబీ కచ్చితంగా అతన్ని రిటైన్ చేసుకొని సారథ్య బాధ్యతలు అప్పగిస్తుంది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 20, 2021, 17:14 [IST]
Other articles published on Sep 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X