For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ముంబై, ఆర్సీబీ, పంజాబ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. ఆ స్టార్ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు!

Mumbai indians player Suryakumar yadav Completed Quarantine.. RCB Player Maxwell And PBKS Player Bairstow arriving today for IPL 2022

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ప్రారంభ‌మైంది. అన్ని జ‌ట్లు ఒక్కో మ్యాచ్‌ను కూడా ఆడేశాయి. అయిన‌ప్ప‌టికీ ప‌లువురు స్టార్‌ ఆట‌గాళ్లు ఇంకా త‌మ త‌మ జ‌ట్ల‌లో చేరలేదు. వాళ్లు లేని లోటు ఆయా జ‌ట్లు ఆడిన ఫ‌స్ట్ మ్యాచ్‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే తాజాగా ఈ విష‌య‌మై ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల అభిమానులకు శుభవార్త అందింది. ఈ మూడు జ‌ట్ల కీల‌క ఆట‌గాళ్లు ఆయా జ‌ట్ల‌లో చేరుతున్నారు.

సూర్య‌కుమార్ క్వారంటైన్ పూర్తి

సూర్య‌కుమార్ క్వారంటైన్ పూర్తి

వెస్టిండీస్‌తో సిరీస్‌లో గాయ‌ప‌డిన ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఆ సిరీస్‌తో పాటు శ్రీ‌లంక‌తో సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. కోలుకోవ‌డానికి స‌మ‌యం ప‌ట్ట‌డంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఆడిన తొలి మ్యాచ్‌కు కూడా సూర్య‌కుమార్ యాద‌వ్ దూర‌మ‌య్యాడు.

అయితే గాయం నుంచి కోలుకుని ఆల‌స్యంగా జ‌ట్టులో చేరిన సూర్య‌కుమార్ యాద‌వ్ తాజాగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. దీంతో క్వారంటైన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 2న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ముంబై ఇండియ‌న్స్ ఆడనున్న రెండో మ్యాచ్‌కు సూర్య కుమార్ యాద‌వ్ అందుబాటులో ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నేడు ఇండియాకు రానున్న మాక్స్‌వెల్

నేడు ఇండియాకు రానున్న మాక్స్‌వెల్

ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ గ్లెయిన్ మాక్స్‌వెల్ కూడా నేడు ఇండియాకు రానున్నాడు. అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం మాక్స్‌వెల్ 3 రోజుల పాటు క్వారంటైన్ ఉండ‌నున్నాడు. అయితే ఆర్సీబీ ఆడ‌బోయే త‌ర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 5న ఉండ‌నుంది.

దీంతో అప్ప‌టివ‌ర‌కు మాక్స్‌వెల్ క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టులో క‌ల‌వ‌డం ఖాయంగా క‌నిపిసోంది. దీంతో అత‌ను ఆర్సీబీ ఏప్రిల్ 5న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నున్న‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. లీగ్‌లో ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు ఆడిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఒక‌టి గెలిచి, ఒక‌టి ఓడింది. కాగా త‌న పెళ్లి కార‌ణంగా గ్లెయిన్ మాక్స్‌వెల్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే.

నేడు రానున్న బెయిర్‌స్టో

నేడు రానున్న బెయిర్‌స్టో

ఇక పంజాబ్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు జానీ బెయిర్ స్టో కూడా నేడు ఇండియాకు రానున్నాడు. అత‌ను కూడా నిబంధ‌న‌ల ప్ర‌కారం 3 రోజుల క్వారంటైన్‌లో ఉండ‌నున్నాడు. దీంతో పంజాబ్ శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడ‌నున్న మ్యాచ్‌లోనూ బెయిర్‌స్టో ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్ జ‌ట్టు వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న కార‌ణంగా బెయిర్‌స్టో ఐపీఎల్‌లో చేర‌డానికి కాస్త ఆల‌స్య‌మైంది.

రికార్డులు

రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 115 మ్యాచ్‌లాడిన సూర్య‌కుమార్ యాద‌వ్ 28 స‌గ‌టుతో 2341 ప‌రుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 82 ప‌రుగులుగా ఉంది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 97 మ్యాచ్‌లాడిన మాక్స్‌వెల్ 25 స‌గ‌టుతో 2018 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 95 ప‌రుగులుగా ఉంది. ఇక బౌల‌ర్‌గా 22 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 28 మ్యాచ్‌లాడిన బెయిర్‌స్టో 41 స‌గ‌టుతో 1038 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచ‌రీలు, ఓ సెంచ‌రీ ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 114 ప‌రుగులుగా ఉంది.

Story first published: Thursday, March 31, 2022, 12:04 [IST]
Other articles published on Mar 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+