Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : టీమిండియా కెప్టెన్లు ఇద్దరూ ముంబై దగ్గరే..!

Mumbai Indians now have Team India Men and Women captains with them

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు అరుదైన ఘనత ఉంది. పురుషుల ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టు ఇదే. ఇప్పుడు మహిళల ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఫీట్ సాధించేందుకు ముంబై సిద్ధమైంది. అందుకే మహిళల ఐపీఎల్ వేలంలో మంచి ఆటగాళ్లను టార్గెట్ చేసి కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే భారత మహిళల జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. 50 లక్షల బేస్ ప్రైజ్‌తో ఉన్న ఆమెను ముంబై జట్టు 1.8 కోట్ల రూపాయలు చెల్లించి తమ జట్టుతో కలుపుకుంది.

టీమిండియా కెప్టెన్లిద్దరూ..

టీమిండియా కెప్టెన్లిద్దరూ..

ముంబై ఇండియన్స్ పురుషుల జట్టులో ప్రస్తుత టీమిండియా సారధి రోహిత్ శర్మ ఉన్న సంగతి తెలిసిందే. అతనే ముంబైకి ఎన్నో విజయాలు అందించాడు. అతని సారధ్యంలో ఈ జట్టు ఎన్నో ట్రోఫీలు కూడా ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే ఫీట్‌ను మహిళల జట్టుతో కూడా సాధించాలని ముంబై ఫ్రాంచైజీ ఉవ్విళ్లూరుతోంది. కానీ ఇలా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలంటే మంచి కెప్టెన్ అవసరం చాలా ఉంటుంది. అందుకే వేలంలో టీమిండియా సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కోసం గట్టిగా పోటీ పడి ఎట్టకేలకు తమ సొంతం చేసుకుంది.

కెప్టెన్‌తోపాటు..

కెప్టెన్‌తోపాటు..

హర్మన్‌ప్రీత్‌తోపాటు ఇంగ్లండ్ మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ సివర్‌ను కూడా ముంబై కొనేసింది. ఆమె కూడా 50 లక్షల బేస్ ధరతో తన పేరు నమోదు చేసుకోగా.. నటాలీ కోసం ముంబై జట్టు రూ.3.2 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. వీళ్లతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయంట్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేలంలో హుషారుగా పాల్గొన్నాయి. కీలకమైన ఆటగాళ్ల కోసం ఈ ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడ్డాయి.

వేలం లెక్కలు..

వేలం లెక్కలు..

మహిళల ఐపీఎల్‌ కోసం 1525 మంది క్రీడాకారిణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 409 మంది మాత్రమే మహిళల ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 246 మంది భారతీయ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ క్రీడాకారిణులు. ఫారెన్ ప్లేయర్లలో 8 మంది అసోసియేట్ దేశాలకు చెందిన వారు. అలాగే వేలంలోని ప్లేయర్లలో తమ తమ దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడిన క్యాప్డ్ ప్లేయర్లు 202 మంది. మిగతా వారిలో 199 మంది అంతర్జాతీయ అరంగేట్రం ఇంకా చెయ్యలేదు. మహిళల ఐపీఎల్‌లో మొత్తం ఐదు జట్లు ఉన్నాయి. టైటిల్ కోసం ఇవే పోటీపడతాయి. ఈ ఐదు జట్ల వద్ద మొత్తం 90 స్లాట్స్ ఉన్నాయి. వీటిలో 30 స్లాట్లు విదేశీ ప్లేయర్లకు కేటాయించారు.

Story first published: Monday, February 13, 2023, 18:10 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+