Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. రేసులో ఆ స్టార్ ప్లేయర్!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎన్నడూ లేనంత దారుణంగా తయారైంది.రోహిత్ శర్మ వంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను పక్కనపెట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ ఒప్పందంతో తెచ్చుకున్న ముంబై ఫ్రాంచైజీకి ఆ నిర్ణయం ఏ మాత్రం కలిసిరాలేదు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడమే కాకుండా వరుస పరాజయాలతో చెత్త రికార్డులను మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో, క్రికెట్ నిపుణుల నుంచి బలంగా వినిపిస్తోంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి ఓ కీలక సూచన చేశారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని ఆయన కోరారు. బుమ్రాకు ఆటపై ఉన్న అవగాహన, బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందే చదవగలిగే చాకచక్యం, పిచ్ పరిస్థితులపై ఉన్న పట్టు అతడిని ఒక అద్భుతమైన నాయకుడిగా మారుస్తాయని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టెస్టు కెప్టెన్సీతో పోలిస్తే ఐపీఎల్ ఫార్మాట్ బుమ్రాకు పెద్ద భారం కాదని.. అతడు తన తెలివితేటలతో జట్టును సమర్థవంతంగా నడిపించగలడని సంజయ్ మంజ్రేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Mumbai Indians New Captain Sanjay Manjrekar Suggests Jasprit Bumrah to Replace Hardik Pandya

హార్దిక్ పాండ్యా వైఫల్యంపై సంజయ్ మంజ్రేకర్ విశ్లేషిస్తూ.. గతంలో హార్దిక్, ఆశిష్ నెహ్రా జోడి గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను తీసుకువచ్చేటప్పుడే ఆశిష్ నెహ్రాను కూడా కోచ్‌గా తీసుకురావాల్సిందని.. అది ఒక 'ప్యాకేజీ డీల్' లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నెహ్రా వంటి మార్గదర్శి లేకపోవడం వల్లే హార్దిక్ కెప్టెన్సీలో ఒత్తిడికి గురై తడబడుతున్నాడని, ముంబై చేసిన ఈ భారీ ప్రయోగం పూర్తిగా విఫలమైందని ఆయన కుండబద్దలు కొట్టారు.

మరోవైపు ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత ముంబై ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఇదే సమయంలో జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జట్టు సభ్యులతో కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.ఓ వైపు ఫ్యాన్స్ రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటుంటే.. నిపుణులు మాత్రం బుమ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే సీజన్ నాటికైనా ముంబై తన నాయకత్వ విభాగంలో ప్రక్షాళన చేపడుతుందో లేదో చూడాలి.

Story first published: Tuesday, May 12, 2026, 13:35 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+