Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indians: 15 రోజుల్లో అంతా గోల్‪మాల్.. 7 సీజన్లలో ఒకేలా..!

IPL 2025 Mumbai indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ లో 54 పరుగులు తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న ఆ జట్టు.. ఈ సీజన్ లో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును అందుకుంది. అలానే పాయింట్ల పట్టికను 15 రోజుల్లో గిర్రున తిప్పేసి ఒక్కసారిగా పైకి 2వ స్థానానికి దూసుకెళ్లింది. ఏప్రిల్ 12 - పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉంది. ఏప్రిల్ 27 పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానంలో దూసుకొచ్చింది.

150తో ముంబై.. 140తో సీఎస్కే..
ఐపీఎల్ టోర్నీలో 150 విజయాన్ని అందుకుంది. 150వ విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఆ తర్వాత 140 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై జట్టు.. ఇప్పటి వరకు 200కుపైగా స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. 16 సార్లు 200పైగా స్కోరును డిఫెండ్ చేసుకుని అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది.

వరుసగా ఐదు విజయాలు.. నాలుగు సీజన్లలో ఛాంపియన్‌గా..
ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది. అందులో ఐదు విజయాలు గత ఐదు మ్యాచుల్లో వరుసగా వచ్చినవ్వే. గతంలోనూ పలు సీజన్లలో ముంబై ఇలా వరుసగా ఐదు విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అలా గెలిచిన ప్రతీసారి ఛాంపియన్ గా నిలిచింది. అవును నిజం. అయితే 2020 తర్వాత ఐదు వరుస విజయాలను ఇప్పుడే అందుకుంది ఎంఐ. తొలి 2008లో వరుసగా ఆరు విజయాలు అందుకుంది. అయితే అప్పుడు మినహా 2010(5 విజయాలు, రన్నరప్), 2013 (5 విజయాలు, ఛాంపియన్స్), 2015 (5 విజయాలు, ఛాంపియన్స్), 2017 (6 విజయాలు, ఛాంపియన్స్), 2020 (5 విజయాలు, ఛాంపియన్స్) ఈ సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఈ 2025లోనూ ముంబై ట్రోఫీని ముద్దాడం పక్కా అని అభిమానులు ఆశిస్తున్నారు.

Mumbai indians Most Wins In IPL Create History Becomes 1st Team To Win 150 Matches in ipl
Story first published: Sunday, April 27, 2025, 20:31 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+