Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ నమ్మకమే గెలిపించింది: రోహిత్, అద్భుతమని సచిన్(పిక్చర్స్)

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-10 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రసంశలు కురిపించారు. ఫైనల్ మ్యాచ్‌లో తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.

ఒక్క పరుగు తేడాతో..

ఒక్క పరుగు తేడాతో..

రెండు జట్లు హోరాహోరీ తలపడ్డాయని, మ్యాచ్ బాగా జరిగిందని పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి వరకూ పోరాటం చేసిన పుణె సూపర్ జెయింట్స్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించిన రోహిత్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది.

నమ్మకమే..

నమ్మకమే..

‘క్రికెట్లో ఇది గొప్ప మ్యాచ్. అందరూ ఎంజాయ్ చేసివుంటారని భావిస్తున్నాను. ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మనమీద మనకు పూర్తిగా నమ్మకం ఉండాలి' అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.

నమ్మకాన్ని నిలబెట్టారు

నమ్మకాన్ని నిలబెట్టారు

అంతేగాక, ‘తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగిలుండగా కూడా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చా. బౌలర్లు చెప్పినట్లుగా ఫీల్డింగ్ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టారు' అని రోహిత్ స్పష్టం చేశాడు.

పోరాటం చేశాం

పోరాటం చేశాం

కాగా, లసిత్ మలింగ, జస్ప్రిత్ బూమ్రా, మిచెల్ జాన్సన్ ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తమ జట్టు పోరాటం అద్భుతం, తమ బౌలర్లు విజయంలో ముఖ్య భూమిక పోషించారని బౌలర్ బూమ్రా చెప్పుకొచ్చాడు.

అద్భుత ప్రదర్శన

అద్భుత ప్రదర్శన

తక్కువ స్కోరు చేసిన అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ విజయం సాధించారని ఎంఐ మెంటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. మంచి బౌలింగ్ విభాగం, ఫీల్డింగ్ జట్టు విజయానికి కీలకమయ్యాయని చెప్పుకొచ్చాడు. ఇవే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాయని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+