కోహ్లీని ఔట్ చేసి వరల్డ్ బెస్ట్ బౌలర్ అని నిరూపించుకున్న బుమ్రా (వీడియో)


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు లీగ్ ప్రసారుదారు స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో ఓ యాడ్‌ని పోస్టు చేసింది. ఆ యాడ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్ చేస్తాడు. దీంతో విరాట్ కోహ్లీ "నీ కెప్టెన్‌నే స్లెడ్జింగ్ చేస్తావా? అని నవ్వుతూ ఎట్టకేలకు స్లెడ్జింగ్ చేయడం ఎలాగో నేర్చుకున్నావ్" అని బదులిస్తాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్ టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత రెండో ఓవర్‌లో పుంజుకున్న బుమ్రా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేశాడు. అచ్చం ఆ యాడ్‌లో బుమ్రా చెప్పినట్లే... విరాట్ కోహ్లీ వికెట్ తీసి.. తాను వరల్డ్ బెస్ట్ బౌలర్‌నని నిరూపించుకున్నాడు.

స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్‌లో యాడ్
స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన యాడ్‌లో క్రికెట్ స్టేడియంలో వరల్డ్ బెస్ట్ బౌలర్ అని తన బ్యానర్ ఉండటాన్ని చూసిన జస్ప్రీత్ బుమ్రా "వరల్డ్ బెస్ట్ బౌలర్.. ఇంకా కాలేదు. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ (విరాట్ కోహ్లీ) వికెట్ ఇంకా తీయలేదు. నేను వస్తున్నా.. చీకూ భయ్యా.. ఈసారి నువ్వు మా టీమ్‌లో లేవు" అని బుమ్రా స్లెడ్జింగ్ చేస్తాడు.

నీ కెప్టెన్‌నే స్లెడ్జింగ్ చేస్తావా?
బుమ్రా స్లెడ్జింగ్ చేయడాన్ని టీవీలో చూసిన విరాట్ కోహ్లీ "చీకూ భయ్యానా.. నీ కెప్టెన్‌నే స్లెడ్జింగ్ చేస్తావా? అని నవ్వుతూ ఎట్టకేలకు స్లెడ్జింగ్ చేయడం ఎలాగో నేర్చుకున్నావ్" అని కోహ్లీ బదులిస్తాడు. ఈ యాడ్‌ని చూసిన అభిమానులు ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు.
కోహ్లీ వికెట్ తీసి బుమ్రా
దీంతో గురువారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ వికెట్ తీసి బుమ్రా బెస్ట్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. బుమ్రా వేసిన ఓవర్‌లో విరాట్ కోహ్లి (46: 32 బంతుల్లో 6 ఫోర్లు) వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు(4, 4, 4)తో అదరగొట్టాడు. అయితే, ఆ తర్వాత తాను వేసిన రెండో ఓవర్‌లో బుమ్రా.. తెలివైన బంతితో విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు.

6 పరుగుల తేడాతో ముంబై విజయం
ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది. అనతరం 188 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications