టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త రికార్డుని సృష్టించింది. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్లో భాగంగా సోమవారం వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్-రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ముంబై ఇండియన్స్‌కి 170వ మ్యాచ్
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కి 170వ మ్యాచ్. దీంతో ప్రపంచంలో క్రికెట్ లీగ్‌ల్లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్ అరుదైన గుర్తింపు సాధించింది. ఆ తర్వాత స్ధానాల్లో ఇంగ్లిష్ జట్టు సోమర్ సెట్‌ను వెనక్కు నెట్టింది. సోమర్ సెట్ 169 మ్యాచ్‌లు ఆడగా, దాన్ని ముంబై సవరించింది.

ఆ తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్
ఆ తర్వాతి స్ధానాల్లో హాంప్‌షైర్ (166), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (162), సుర్రే (158), సస్సెక్స్ (158)లు ఉన్నాయి. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ ఆడిన 170 మ్యాచ్‌ల్లో 97 విజయాల్ని ఆ జట్టు సాధించగా, 71 పరాజయాల్ని మూటగట్టుకుంది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు.

ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు
ఒక్క ఐపీఎల్‌లోనే ముంబై ఇండియన్స్ 142 మ్యాచ్‌లాడగా అందులో 80 విజయాలు దక్కించుకుంది. 61 అపజయాలు నమోదు చేసుకోగా ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా, 2013, 2015లలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా అవతరించింది. అంతేకాదు 2011, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.

పదో సీజన్‌లో అగ్రస్థానంలో
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ పదో సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications