For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు మరో అవమానం.. ముంబయి ఇండియన్స్ దురహంకారం!

ముంబయి ఇండియన్స్ యాజమాన్యంతో రోహిత్ శర్మ‌కు విభేదాలు వచ్చాయా? వారి మధ్య వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అందుకే హార్దిక్ పాండ్య కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారా? గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులకు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే అవన్నీ వాస్తవం అనిపించేలా ముంబయి ఇండియన్స్ ప్రవరిస్తోంది. రోహిత్ శర్మ లేకుండా పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇది నెట్టింట్లో సంచలనంగా మారింది.

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును ఇటీవల ప్రకటించింన సంగతి తెలిసిందే. అయితే జట్టు ఎంపికకు సంబంధించి ముంబయి ఇండియన్స్ ట్వీట్ చేసింది. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఫొటోలతో టీమిండియా జట్టును పోస్ట్ చేసింది. జట్టుపై మీ ఆలోచనలు పంచుకోండి అని ట్యాగ్‌లైన్ రాసుకొచ్చింది.

Mumbai Indians insulted Rohit Sharma again. Fans called Its Arrogance of Mumbai Indians

రోహిత్ ఫొటో లేకపోవడంతో అతడి అభిమానులు ముంబయి ఇండియన్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ముంబయి ఇండియన్స్ దురంహంకారానికి ప్రతీక అని, రోహిత్‌ను మరోసారి అవమానించారని, అయిదు టైటిళ్లు అందించిన కెప్టెన్‌‌‌కు ఇచ్చే మార్యాద ఇదేనా అని కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ముంబయి ఇండియన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకోవడానికి ముంబయి ఫ్రాంచైజీ దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని వార్తలు వచ్చాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో గుజరాత్ జట్టును హార్దిక్ విజయవంతంగా నడిపించాడు. 2022 సీజన్‌లో టైటిల్‌ను సాధించిన హార్దిక్ 2023లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కాగా, వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ దాదాపు 14 నెలల తర్వాత తిరిగి టీమిండియా టీ20 జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ ఇవాళ రెండో టీ20 ఆడనుంది. ఇండోర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Story first published: Sunday, January 14, 2024, 12:49 [IST]
Other articles published on Jan 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+