Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Most Boundaries (4s+6s) in each IPL Season: 2008నుంచి ఏ సీజన్లో ఏ జట్టు బౌండరీలతో దుమ్ముదులిపిందంటే?

Mumbai Indians Hit Most Number Of Boundaries In Entire IPL History

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటేనే ధనాధన్ సిక్సర్లు, ఫటాఫట్ ఫోర్ల పండుగ. అభిమానులకు బౌండరీలతో కావాల్సినంత మజాను అందించే బెస్ట్ లీగ్ ఇది. గత మూడు నెలలుగా యావత్ క్రికెట్ అభిమానులను ఐపీఎల్ అలరించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి.. పాత రికార్డులు బద్దలవుతాయి. తాజాగా ఈ సీజన్‌లో ఏకంగా 1062 సిక్స్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్ ఇదే.

పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రోమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ కొట్టిన సిక్స్‌తో 1000మార్క్ నమోదైంది. 1000సిక్సర్లు నమోదైన తొలి సీజన్ గా కూడా ఈ సీజన్ నిలిచింది. ఇకపోతే ఈ సీజన్లో 2015 ఫోర్లు నమోదయ్యాయి. ఇక ఒక సీజన్లో అత్యధిక ఫోర్లు నమోదైన రెండో సీజన్‌గా ఈ సీజన్ నిలిచింది. ఇక అంతకుముందు 2013సీజన్లో 2052ఫోర్లు నమోదయ్యాయి.

సీజన్ల వారీగా అత్యధిక బౌండరీలు బాదిన జట్లు

సీజన్ల వారీగా అత్యధిక బౌండరీలు బాదిన జట్లు

ఇక ఈ సీజన్లో అత్యధిక బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) బాదిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ (388) తొలి స్థానంలో ఉంది. 251ఫోర్లు, 137సిక్సర్లు రాజస్థాన్ బ్యాటర్ల నుంచి వచ్చాయి. 2008నుంచి ఇప్పటివరకు ఏ సీజన్లో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు బాదిందో ఓసారి పరిశీలిస్తే.. 2008లో రాజస్థాన్ రాయల్స్ (343), 2009లో డెక్కన్ ఛార్జర్స్ (272), 2010లో ముంబై ఇండియన్స్ (337), 2011లో ఆర్సీబీ (318), 2012లో డెక్కన్ ఛార్జర్స్ (329), 2013లో ముంబై ఇండియన్స్ (369), 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (389), 2015లో ముంబై ఇండియన్స్ (362), 2016లో ఆర్సీబీ (381), 2017లో ముంబై ఇండియన్స్ (341), 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ (383), 2019లో ముంబై ఇండియన్స్ (345), 2020లో ముంబై ఇండియన్స్ (359), 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (347), 2022లో రాజస్థాన్ రాయల్స్ (388).

ఇకపోతే ఈ సీజన్లో బౌండరీల వరద పారించిన జోస్ బట్లర్

ఇకపోతే ఈ సీజన్లో బౌండరీల వరద పారించిన జోస్ బట్లర్

ఐపీఎల్ 2022 సీజన్లో 17మ్యాచ్‌లు, 863పరుగులు, 149.05 స్ట్రైక్ రేట్, 57.53సగటు, 4సెంచరీలు, 4హాఫ్ సెంచరీలు, 83ఫోర్లు, 45సిక్సులు, అత్యధిక స్కోరు 116.. ఈ గణాంకాలు చాలు.. ఈ సీజన్లో జోస్ బట్లర్ దండయాత్ర ఏ రేంజులో సాగిందో చెప్పడానికి. అతని అసామాన్య బ్యాటింగ్‌కు పలు రికార్డులు గులామ్ అన్నాయి. బట్లర్ బ్యాటింగ్ ధాటికి బౌండరీలు వరదలా వచ్చాయి.

ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (45) బాదిన ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు. ఇక ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో బట్లర్ టాప్ 5లో చోటు సంపాదించాడు. అంతకుముందు 2012లో క్రిస్ గేల్ 59సిక్సులు, 2019లో ఆండ్రూ రస్సెల్ 52, 2013లో క్రిస్ గేల్ 51, 2022లో బట్లర్ 45, 2011లో క్రిస్ గేల్ 44 సిక్సులు బాది టాప్ 5లో ఉన్నారు. ఇక ఈ సీజన్లో అత్యధిక ఫోర్లు (83) కొట్టిన ప్లేయర్‌ కూడా బట్లరే ఇక మొత్తం 128బౌండరీలు బాదిన బట్లర్.. బౌండరీల ద్వారా 602పరుగులు సాధించాడు.

తొలి సీజన్లోనే గెలుపొందిన గుజరాత్ టైటాన్స్

తొలి సీజన్లోనే గెలుపొందిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2022 సీజన్‌ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకు గుజరాత్ కట్టడి చేసింది.

కాగా.. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించడంతో గుజరాత్ విజయదుందుభీ మోగించింది.

Story first published: Wednesday, June 1, 2022, 8:59 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+