Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : అందరి కన్నా బలమైన బ్యాటింగ్ ఏ జట్టుకు ఉందో తెలుసా?

Mumbai Indians have the strongest batting line up in IPL 2023

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అభిమానులకు మజా ఇచ్చేది ఏంటి? తమ అభిమాన జట్టులో బ్యాటర్లు బాదే ఫోర్లు, సిక్సర్లే కదా. మరి ఇలా అభిమానులను ఉర్రూతలూగించాలంటే బలమైన బ్యాటింగ్ లైనప్ తప్పనిసరి. ఏ టీ20 లీగ్‌లో అయినా ట్రోఫీ గెలవాలంటే బ్యాటింగ్ చాలా బలంగా ఉండాలి. మరి ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో బలమైన బ్యాటింగ్ ఉన్న జట్టు ఏదో ఒకసారి చూద్దామా?

 టాప్ ఓపెనర్లు..

టాప్ ఓపెనర్లు..

మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని జట్ల వద్ద బలమైన బ్యాటింగ్ ఉంది. కానీ వీటన్నింటిలో ప్రత్యేకంగా కనిపిస్తున్న జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ అంతా విధ్వంసకారులే. దానికితోడు కావాలంటే యాంకర్ రోల్ పోషించడం కూడా వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ముంబై ఇండియన్స్ టాపార్డర్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉన్నారు. వీళ్లిద్దరూ చెలరేగితే ఎంతటి లక్ష్యమైనా చిన్నబోవాల్సిందే. ఇద్దరూ అలవోకగా బౌండరీలు బాదగల సమర్ధులే.

బలమైన మిడిలార్డర్..

బలమైన మిడిలార్డర్..

ఇక మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన 360 డిగ్రీల షాట్లతో విరుచుకుపడే సూర్యను పొట్టి ఫార్మాట్‌లో అవుట్ చేయడం చాలా కష్టం. అతను బంతిని ఎటువైపు కొడతాడో సూర్యకే తెలీదు మరి. ఇక ముంబై మిడిలార్డర్‌లో హైదరబాదీ లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ చాలా కీలకంగా మారాడు. గతేడాది ముంబై తరఫున అద్భుతంగా ఆడిన తిలక్.. ఈ ఏడాది కూడా తన పాత్ర బాధ్యతగా పోషిస్తే ముంబై మిడిలార్డర్‌కు వెన్నెముకలా మారతాడు. అలాగే సౌతాఫ్రికా యువ సంచలనాలు డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టియన్ స్టబ్స్ ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు. ఒక విదేశీ బౌలర్‌ను తగ్గించుకుంటే వీళ్లిద్దర్నీ ముంబై ఆడించగలదు.

ఫినిషర్లంటే ఇలా ఉండాలి..

ఫినిషర్లంటే ఇలా ఉండాలి..

ఆ తర్వాత మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఉండనే ఉన్నాడు. అతనికితోడు మరో ఆసీస్ ప్లేయర్ టిమ్ డేవిడ్ ఎంత విధ్వంసకారుడో వేరే చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరూ ముంబై ఫినిషర్లుగా పొలార్డ్ లేని లోటును ఈజీగా పూడ్చగలరు. బ్యాకప్ కోసం ముంబై కొనుగోలు చేసిన రమణ్‌దీప్ సింగ్, విష్ణు వినోద్ ఇద్దరూ కూడా 140పైగా స్ట్రైక్ రేటుతో ఆడగల సమర్ధులే. ఈ లెక్కన చూసుకుంటే వీరిలో ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో అయినా ముంబైని గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లే. మిగతా జట్ల వద్ద బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ ముంబై బ్యాటింగ్ ఒక మెట్టు పైన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Story first published: Wednesday, March 22, 2023, 17:31 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+