Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Verma: 'తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌ డెసిషన్ నాది, హార్దిక్‌ది కాదు'

ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై ముంబై ఇండియ‌న్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌ ల‌క్ష్య ఛేద‌న‌లో మ‌రో ఏడు బంతులు మిగిలి ఉండ‌గా తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ విషయంలో ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అప్ప‌టికే 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను.. 18.5 ఓవ‌ర్‌లో అనూహ్యంగా రిటైర్డ్ ఔట్‌ చేసింది. కానీ ముంబయి తీసుకున్న ఈ నిర్ణయం బోల్తా కొట్టింది. ముంబయి ఓటమిని అందుకుంది.

అయితే తిలక్ వర్మ విషయంలో ముంబయి తీసుకున్న ఈ రిటైర్ ఔట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ముంబై తీసుకున్న ఈ నిర్ణ‌యం బెడిసికొట్టిడంతో.. హర్భజన్ సింగ్, సునీల్ గావస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ముంబయి జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయి జట్టు తాము తీసుకున్న ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చింది.

Mumbai Indians Hardik and Jayawardene Explains on Tilak verma Retired Out Controversy IN LSG Vs MI

కోచ్ జ‌య‌వ‌ర్థ‌నే ఏమ‌న్నాడంటే..?
తిలక్ వర్మ.. తాము ఆశించిన స్థాయిలో ధాటిగా ఆడలేకపోయాడని అన్నాడు. ఫైనల్ ఓవర్ల వరకు అతడి నుంచి భారీ షాట్ల కోసం ఎదురుచూసినట్లు తెలిపాడు. కానీ అది జరగలేదని, అందుకే కొత్త బ్యాటర్ ను బరిలోకి దింపాల్సి వచ్చిందని చెప్పాడు. తిల‌క్ వ‌ర్మ రిటైర్ చేయాల‌నేది త‌న నిర్ణ‌యం అని చెప్పుకొచ్చాడు. 'మేం వికెట్లు కోల్పోయినప్పుడు మా కోసం తిల‌క్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అతడు మరింతగా రాణించడానికి ప్రయత్నించాడు. కానీ అలా జరగలేదు. మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ల వ‌ర‌కు అతడు ధాటిగా ఆడతాడని ఎదురుచూశాం. కానీ అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో కొత్త బ్యాట‌ర్ ఎవ‌రైనా ఆడితే బాగుంటుంద‌ని ఆశించాం. అలా ఒకరిని మధ్యలోనే బయటకు పంపించడం కరెక్ట్ కాదని తెలుసు. కానీ ఆ సమయంలో వ్యూహాత్మ‌కంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. దీని గురించి మరీ లోతుగా ఆలోచించకండి. ఇది కేవలం ఆట కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. "అని జ‌య‌వ‌ర్ధ‌నే చెప్పుకొచ్చాడు.

హార్ధిక్ పాండ్యా ఏమ‌న్నాడంటే..?
మ్యాచ్ అనంత‌రం తిల‌క్ రిటైర్డ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. మాకు కొన్ని భారీ షాట్లు అవసరమయ్యాయి. కానీ తిలక్ వర్మ ధాటిగా ఆడ‌లేక‌పోయాడు. క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు అనుకున్నవి జరగవు. కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నామ‌నేది అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. అని హార్దిక్ వివరణ ఇచ్చాడు.

Story first published: Saturday, April 5, 2025, 10:35 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+