IPL 2023: ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబైకి గట్టి షాక్..!

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం అవడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే అంతకుముందే ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. డిసెంబరులో జరిగిన మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సేవలు ఆ జట్టుకు ఇప్పుడప్పుడే పూర్తిగా అందవని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేల్చిచెప్పింది. సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా ఆడిన టెస్టు సిరీస్‌లో యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చేతి వేలు విరిగింది.

టెస్టు సిరీస్‌లో విరిగిన ఎముక
గాయాన్ని లెక్క చేయకుండా ఆడిన గ్రీన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అతనికి ఎక్స్‌రే తీయగా వేలు ఎముక విరిగినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఆడతాడా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. అయితే ఆ సిరీస్ నాటికి గ్రీన్ కోలుకుంటాడని ఆస్ట్రేలియా టీం భావిస్తోంది. అనతికాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన గ్రీన్ సేవలు.. ఈ సిరీస్‌లో కీలకంగా మారతాయని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భావిస్తోంది.

బౌలింగ్ చేయడం కుదరదు
ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సీఏ.. బీసీసీఐకి తాజాగా ఒక లేఖ రాసింది. గ్రీన్ కనుక కోలుకొని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడితే.. ఆ తర్వాత కనీసం నాలుగు వారాల పాటు అతను బౌలింగ్ చేయడానికి వీల్లేదని, వైద్యుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పింది. దీంతో ఒకవేళ ఐపీఎల్‌లో అతను ఆడినా కూడా టోర్నీ ఆరంభ దశలో అతను బౌలింగ్ చేయడం కుదరదు. ఏప్రిల్ 13 తర్వాత మాత్రమే అతని బౌలింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈమెయిల్
ఇదే విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తెలియజేసింది. బీసీసీఐ సీఈవో, ఐపీఎల్ సీవోవో హేమంగ్ అమిన్ నుంచి అన్ని ఫ్రాంచైజీలకు ఈమెయిల్ వచ్చింది. 'క్రికెట్ ఆస్ట్రేలియా అందించిన సమాచారం మేరకు కామెరూన్ గ్రీన్ ఈ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచుల్లో కనుక ఆడితే మాత్రం.. చివరి టెస్టు పూర్తయిన నాలుగు వారాలపాటు అతను బౌలింగ్ వేయడం కుదరదు. చివరి టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు జరుగుతుంది' అని వివరించారు.

ఆటగాళ్లపై పర్యవేక్షణ
క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తదితర బోర్డులన్నీ కూడా ఐపీఎల్ సమయంలో కూడా తమ ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేస్తున్నాయి. దీనికోసం కొన్ని కొత్త పాలసీలు తీసుకొచ్చాయి. అదే బాటలో నడిచిన బీసీసీఐ కూడా.. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు రుచించలేదు. అయినా సరే 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత జట్టు.. ఎలాగైనా ఈ సారి గెలవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి, వాళ్లను ఎన్సీయే పర్యవేక్షణలో ఉంచాలని తేల్చిచెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications