Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : కెప్టెన్‌పై ఫోకస్ పెట్టిన ముంబై ఇండియన్స్.. పూర్తి జట్టు ఇదే..!

Mumbai Indians full squad details after WPL Auction

వచ్చే నెల జరిగే మొట్టమొదటి మహిళల ఐపీఎల్‌ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మంచి జట్టును తయారు చేసుకుంది. మంచి లీడర్ ఉంటే విజయం సాధ్యమని నమ్మే ముంబై.. ఈసారి కూడా అదే సిద్ధాంతాన్ని నమ్మింది. ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో కీలక ఆటగాళ్లను టార్గెట్ చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కోసం గట్టిగా పోటీపడిన ఈ ఫ్రాంచైజీ.. చివరకు ఆమెను మాత్రం కొనలేకపోయింది. అయితే ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు.

ఖర్చుకు వెనుకాడని ముంబై..

ఖర్చుకు వెనుకాడని ముంబై..

కీలకమైన ఆటగాళ్ల విషయంలో ఖర్చుకు వెనుకాడని ఈ ఫ్రాంచైజీ.. 50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఆ జట్టుకు నిఖార్సయిన లీడర్ దొరికినట్లు అయింది. అక్కడితో ఆగకుండా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సివర్, న్యూజిల్యాండ్ స్టార్ అమీలియా కెర్ కోసం కూడా గట్టిగా పోటీ పడింది. చివరకు సివర్‌ను రూ.3.2 కోట్లకు, కెర్‌ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే టీమిండియా ప్లేయర్లు పూజా వస్త్రాకర్, యాస్తిక భాటియాను కూడా కొనుగోలు చేసి తమ జట్టును మరింత పటిష్టం చేసుకుంది.

బ్యాలెన్స్‌గా జట్టు..

బ్యాలెన్స్‌గా జట్టు..

వేలం ఆరంభంలో ఎవరూ కొనుగోలు చేయని ఆసీస్ ప్లేయర్ హెతర్ గ్రాహమ్‌ను కూడా ముంబై కొన్నది. ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. తొల డబ్ల్యూపీఎల్‌ను కచ్చితంగా కొట్టాలనే లక్ష్యంతో ఈ జట్టును సిద్ధం చేసినట్లు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందంటున్నారు. మార్చి 4న మొదలయ్యే డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆ నెల 26 వరకు జరుగుతుంది. ఈ టోర్నీ కూడా అభిమానులకు కావలసినంత మజా అందిస్తుందని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది.

 ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ సివర్, అమీలియా కెర్, పూజ వస్త్రాకర్, యాస్తిక భాటియా, హెతర్ గ్రాహమ్, ఇసాబెల్లా వాంగ్, అమన్‌జోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాకూ, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాల, సోనమ్ యాదవ్, జింతమని కలిత, నీలమ్ బిస్త్.

Story first published: Monday, February 13, 2023, 22:38 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+