ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ! (వీడియో)
ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఓ పీడకలలా ముగిసింది. ఈ ఏడాది టైటిల్ గెలవడం పక్కన పెడితే.. ప్లేఆఫ్స్ రేసు నుంచి అత్యంత అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత ఓ వైపు హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. మరోవైపు స్టేడియంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో జట్టు వ్యూగాలు, కాంబినేషన్లు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. టోర్నమెంట్ మొత్తంలో ముంబై కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్‌లలో ఓటములను మూటగట్టుకుంది. కేవలం 8 పాయింట్లతో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రయాణం ముగిసింది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని, పాండ్యా వ్యక్తిగత ప్రదర్శనను తప్పుబడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ వరుస పరాజయాలు, తీవ్ర విమర్శల మధ్య స్టేడియంలో ముంబై ఇండియన్స్ యజమానులైన అంబానీ ఫ్యామిలీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు స్టేడియంలో ఉన్న సమయంలో.. ముంబై ఇండియన్స్ మెంటార్లు, యజమానులు ఆటగాళ్లతో మాట్లాడటానికి వచ్చారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీలతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘంగా మాట్లాడటం కనిపించింది.
ఈ వైరల్ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రమే ముఖేష్ అంబానీ చేసిన ఓ చిన్న పని. హార్దిక్ పాండ్యా వారితో మాట్లాడుతుండగా.. ముఖేష్ అంబానీ స్వయంగా ముందుకు వచ్చి హార్దిక్ పాండ్యా భుజం తట్టి అండగా నిలిచారు. ఓ వైపు జట్టు ఘోరంగా విఫలమై, కెప్టెన్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఇలాంటి క్లిష్ట సమయంలో.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఓ యజమానిగా కాకుండా పెద్ద దిక్కుగా నిలబడి కెప్టెన్ లో ధైర్యాన్ని నింపిన తీరు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అయితే వరుసగా రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ విఫలం కావడంతో ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న నెటిజన్లలో తలెత్తుతోంది. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తుందా? లేక జట్టు నాయకత్వ బాధ్యతలను మరేదైనా కొత్త ఆటగాడికి అప్పగిస్తుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications