For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరే.. ఏంట్రా ఇది: ప్రపోజ్ చేయడానికొచ్చి రింగ్ పోగొట్టుకోవడమేంట్రా

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాత్రి వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ సందర్భంగా స్టాండ్స్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ ను విపరీతంగా అభిమానించే ఓ ప్రేమికుడి కలలు ఫలించాయక్కడ. నైట్ రైడర్స్ అంటే పడి చచ్చే లవర్ కు ప్రపోజ్ చేశాడు.. సక్సెస్ ఫుల్ గా. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ యువకుడు తన ప్రేయసికి ప్రపోజ్ చేయబోగా, ఊహించని మలుపు చోటు చేసుకుంది. తనను మోకాళ్ళపై కూర్చొని ప్రేయసికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ప్యాంట్ పాకెట్ లో పెట్టుకొచ్చిన బాక్స్ నుంచి రింగ్ ను బయటికి తీశాడు. సరిగ్గా ప్రపోజ్ చేసే సమయంలో అతను కొంత తడబడ్డాడు. మోకాళ్ల మీద కూర్చునేటప్పుడు బ్యాలెన్స్ తప్పాడు. దీంతో అతని చేతిలో ఉన్న ఉంగరం కింద పడింది. అది కాస్తా దొర్లుకుంటూ కిందికి జారి పోయింది.. మన రూపాయి విలువ లాగా.

Mumbai Indians Fan Proposes his KKR s Counterpart in Stands during the Match Video goes viral

దీంతో అతగాడు కంగారు పడ్డాడు. ప్రపోజ్ చేయడం పక్కనపెట్టి రింగ్ ను వెదికే పనిలో పడ్డాడు. వందలాది మందితో నిండిన స్టాండ్స్‌లో ఆ ఉంగరాన్ని వెదకడం కష్టమైంది. ఆ ప్రత్యేక క్షణం పీడకలగా మారుతుందేమోననిపించింది. తోటి ప్రేక్షకులు వెంటనే సహాయం చేశారు. రింగ్ పడిపోయిన చోట భూతద్దం పెట్టి గాలించారు.

కొంత నిమిషాల తర్వాత ఉంగరం దొరికింది. ఉంగరం మళ్లీ మనోడి చేతికి వచ్చింది. దీంతో అతను మరోమారు మోకాళ్ళపై కూర్చుని ప్రపోజల్‌ను పూర్తి చేశాడు. ఈ సారి గురి తప్పలేదు. ఏ అడ్డంకులు లేకుండా ప్రపోజ్ చేశాడు. ఆమె అప్పటికప్పుడు ఏమీ ఆలోచించకుండా యస్ అనేసింది. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేయడంతో ఈ తతంగం మొత్తం బయటపడింది. "Shei Prothom Bhalobashar feeling" అంటూ క్యాప్షన్ జత చేసింది.

Story first published: Monday, March 30, 2026, 14:58 [IST]
Other articles published on Mar 30, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+