Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PHOTOS: ముంబై ఇండియన్స్ జట్టుకు అంబానీ గ్రాండ్ పార్టీ, బుమ్రాపై నెటిజన్ ప్రశ్న

Mumbai Indians Epic Reply To Fan Who Asked If Jasprit Bumrah Was Moving To RCB

హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లకు ఆ జట్టు యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, చైర్ పర్సన్ నీతా అంబానీలు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్‌లు కుటుంబంతో సాహా హాజరయ్యారు.

మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కోచ్ మహేల జయవర్దనేతో పాటు పాండ్యా సోదరులు యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్‌లతో పాటు పలువురు ఆటగాళ్లు ఈ గ్రాండ్ పార్టీకి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

బుమ్రా ఎక్కడా?

అయితే, ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కనిపించకపోవడంతో ఓ అభిమాని బుమ్రా ఎక్కడా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వెళ్లిపోయాడా? అంటూ ట్విట్టర్‌లో ఓ ప్రశ్న సంధించాడు. అభిమాని తుంటరి ప్రశ్నకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘స్టే కామ్‌ మ్యాన్‌' అంటూ రోహిత్‌ శర్మ ఉన్న జిఫ్‌ ఫైల్‌ను పోస్ట్‌ చేసింది.

గాయం కారణంగానే

గాయం కారణంగానే

టీమిండియా ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న బుమ్రా ఐపీఎల్‌లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. నడమ కింది భాగంలో నొప్పితో సతమవుతున్న బుమ్రా కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఇచ్చిన విందుకు హాజరుకాలేదని తెలుస్తోంది.

ప్రత్యేక ఆకర్షణగా యువరాజ్

తన భార్యతో కలిసి కార్యక్రమానికి హాజరైన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. యువరాజ్ భార్య హాజెల్ కీచ్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ

2013 ముందు వరకు ఒక్క సింగిల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

నాలుగు సార్లు టైటిల్ విజేతగా

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ

భార్యతో కలిసి ఫంక్షన్‌కు హాజరైన రోహిత్ శర్మ. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.

కోచ్‌తో పాండ్యా సోదరులు

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనేతో పాండ్యా సోదరలు

Story first published: Saturday, October 26, 2019, 14:44 [IST]
Other articles published on Oct 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+