Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదవసారి ఫైనల్‌లోకి ముంబై.. మూడు విజయాలు, ఒక ఓటమి

IPL 2019 : Mumbai Indians Excellent Record in IPL Finals:3 Wins,1 Loss Out Of 4 Finals || Oneindia
Mumbai Indians enviable record in IPL finals: 3 wins, 1 loss out of 4 finals

మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్ ఫైనల్‌లోకి వెళ్ళింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను బోల్తా కొట్టించి మూడేళ్లలో రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌ వేదికగా మే 12న ఫైనల్‌ ఆడేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫైనల్ చేరేందుకు చెన్నైకి రెండో క్వాలిఫయర్‌ రూపంలో మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్‌-2లో చెన్నై గెలిస్తే.. ముంబై మరోసారి చెన్నైని ఢీకొననుంది.

ఐపీఎల్‌ సీజన్-12లో వరుసగా మూడు సార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్‌.. తాజాగా ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌కు వెళ్లడం ముంబై జట్టుకు ఇది ఐదోసారి. గతంలో నాలుగు సార్లు ఫైనల్‌కు వెళ్లిన ముంబై.. మూడు సార్లు కప్‌ సొంతం చేసుకుంది. 2010లో ఫైనల్‌కు చేరినా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. నాలుగు ఫైనల్‌లలో ముంబై ప్రస్థానం ఎలా ఉందంటే.

2010: CSK vs MI:

2010: CSK vs MI:

2010 ఫైనల్‌లో ముంబై, చెన్నై జట్లు తలపడగా.. ముంబై 22 పరుగుల తేడాతో ఓడింది. సురేష్ రైనా 57 పరుగులు చేయడంతో చెన్నై 168 పరుగులు చేసింది. ముంబై తరుపున సచిన్ 48 పరుగులు చేసాడు.

2013: CSK vs MI:

2013: CSK vs MI:

2010 ఫైనల్‌లో ముంబై, చెన్నై జట్లు తలపడగా.. ముంబై విజేతగా నిలిచింది. ముంబై 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. పోలార్డ్ 60 పరుగులు చేసాడు. చెన్నై తరపున ధోనీ 60 పరుగులు చేసాడు. చెన్నై 23 పరుగులతో ఓడిపోయింది.

2015: CSK vs MI:

2015: CSK vs MI:

2010 ఫైనల్‌లో ముంబై, చెన్నై జట్లు తలపడగా.. ముంబై విజేతగా నిలిచింది. ముంబై 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రోహిత్ 26 బంతుల్లో 50 పరుగులు చేసాడు. ఛేదనలో చెన్నై 168 పరుగులకే పరిమితమైంది.

2017: MI vs RPS:

2017: MI vs RPS:

2017 ఫైనల్‌లో ముంబై, పూణే జట్లు తలపడగా.. ముంబై విజేతగా నిలిచింది. ఒక్క పరుగు తేడాతో ముంబై నిలవడం విశేషం.

Story first published: Wednesday, May 8, 2019, 17:15 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+