నేడే మహా సంగ్రామం: ఐపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ (ఫోటోలు)
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ తుది పోరుకు వేదిక కానుంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఐపీఎల్ 2017 ఫోటోలు
తుది పోరుకు ముందు ఐపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. ముంబై జట్టు సారథి రోహిత్‌శర్మ, కోచ్ జయవర్ధనే, పుణె జట్టు సారధి స్టీవ్ స్మిత్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లతో పలువురు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి, క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి పుణే ఫైనల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక క్వాలిఫయిర్-2లో కోల్‌కతాను చిత్తు చేసి ముంబై ఇండినయన్స్ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లో పూణనే పైచేయి సాధించింది.

పూణెపై మాకు పెద్దగా రికార్డు లేదు
ఈ క్రమంలో ఐపీఎల్ తుది పోరులో పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఈ సందర్భంగా రోహిత్‌శర్మ మాట్లాడుతూ పూణెపై మాకు పెద్దగా రికార్డు లేదు. ఇన్నాళ్లు ఆడిన మ్యాచ్‌ల నుంచి ఎన్నో అంశాలను తెలుసుకున్నామని.. తుదిపోరులో తప్పులను పునరావృతం కానివ్వమని తెలిపాడు.

సమష్టిగా రాణించడం వల్లే విజయాలు
ఇప్పటి వరకు సమష్టిగా రాణించడం వల్లే విజయాలు సాధించామని.. చివరి పోరులో కూడా సమిష్టిగా ఆడి విజయం సాధిస్తామని అన్నాడు. మరోవైపు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

పైనల్ అంటే పైనలే
గత మ్యాచ్‌ల ఫలితాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, పైనల్ అంటే పైనలేనని చెప్పుకొచ్చాడు. పైనల్స్‌లో ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ పిచ్. భారీ పరుగులు చేసే అవకాశం ఉంది.

ముంబైకి ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎండలు బాగా కాస్తున్నాయి. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం లేదు. ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. గతంలో 2010లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై 2013, 2015లలో చెన్నైనే ఓడించి విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications