IPL 2023: పొలార్డ్‌ను వదిలేయడం కరెక్టేనా? ముంబై ఇండియన్స్ ప్లాన్ ఏంటంటే?

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం జరగనుంది. ఈ సమయానికి తమ తమ జట్లలో ఎవరిని రిటైన్ చేసుకుంటున్నారు? ఎవరిని వదులుకుంటున్నారు? తదితర వివరాలన్నీ ఆయా ఫ్రాంచైజీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

కఠిన నిర్ణయమే..
సుమారు పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో కలిసి ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్‌ను వదులుకోవాలని ముంబై జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. గతేడాది ఆ జట్టులో అత్యంత పేలవంగా ఆడిన వారిలో పొలార్డ్ ఒకడు. అతని టాప్ స్కోర్ 25 అంటేనే పొలార్డ్ బ్యాటింగ్ అర్థం చేసుకోవచ్చు. భారీ షాట్లు ఆడటంలో కూడా విఫలమయ్యాడు. దీనిపై స్పందించిన మాజీ ముంబై ఇండియన్, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఇది ముంబై జట్టుు కఠిన నిర్ణయమని చెప్పాడు. కానీ వచ్చే 3-4 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని పొలార్డ్‌ను వదులుకోక తప్పదన్నాడు.

ఆస్ట్రేలియన్లపై గురి
ఐదుసార్లు ముంబై జట్టు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. అయితే అతని పాత్రను మెరుగ్గా నిర్వహించే వారిని ముంబై వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌ను తీసుకుందని, మరో ఆసీస్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌ను కూడా మినీ వేలంలో టార్గెట్ చేస్తుందని భజ్జీ చెప్పాడు. వీళ్లిద్దరూ కూడా భారీ షాట్లతో పొలార్డ్ లేని లోటును సులభంగా పూడ్చేస్తారని అభిప్రాయపడ్డాడు.

ముంబైతో పొలార్డ్ ప్రయాణం
2010 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నపొలార్డ్.. ఈ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ముంబై తరఫున ఐపీఎల్‌లో 28.67 సగటుతో 3412 పరుగులు చేశాడు. వీటిలో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రాణించిన పొలార్డ్ 69 వికెట్లు కూడా తీశాడు. ఇక ఫీల్డింగ్‌లో అతని చురుకుదనం గురించి చెప్పనక్కర్లేదు. బౌండరీ లైన్ వద్ద పెద్ద గోడలా నిలబడే పొలార్డ్.. తన క్యాచులతోనే ముంబైను ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడనడం అతిశయోక్తి కాదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications