Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు ఓడిపోతుంటే నీ ఆరాటమేంటి హార్దిక్? (వీడియో)

ముంబై ఇండియన్స్ కెప్డెన్ హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. హార్దిక్ ప్రియురాలు, ప్రముఖ మోడల్ మహీకా శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా టీమ్ బస్సులో ఎక్కి సిద్ధంగా ఉండగా.. మహీకా శర్మ అందరి కంటే ఆలస్యంగా వచ్చి బస్సు ఎక్కడం కనిపించింది. మహీకా వెనుకాలే హార్దిక్ పాండ్యా కూడా నడుచుకుంటూ వచ్చారు. ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారిక టీమ్ బస్సు.. ఓ ఆటగాడి ప్రియురాలి కోసం అంతసేపు నిరీక్షించాలా? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడితున్నారు. ఇది జట్టు క్రమశిక్షణను ప్రశ్నించేలా ఉందని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

పరాజయాల వేళ బాధ్యతారాహిత్యమా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అత్యంత దారణంగా ఉంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన తాజా మ్యాచ్‌లో కూడా 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన కెప్టెన్.. తన వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ టీమ్ ప్రోటోకాల్స్‌ను పక్కన పెట్టడం ఏంటని క్రీడా విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. జట్టు పరాజయాల బాటలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు కెప్టెన్సీపై మరింత వ్యతిరేకతను పెంచుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

Mumbai Indians Bus Waits for Hardik Pandya Girlfriend Mahieka Sharma Viral Video Sparks Controversy

మళ్లీ తెరపైకి పాత వివాదాలు
హార్దిక్ పాండ్యా, మహీకా శర్మల మధ్య ఉన్న సంబంధంపై గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ స్టేడియంలో వీరిద్దరూ కలిసి చేసిన వేడుకలు పెద్ద దుమారమే రేపాయి. అలాగే కొలంబోలో జరిగిన టోర్నీ సందర్భంగా మహీకాను 'మై ప్రిన్సెస్' అని సంబోధిస్తూ హార్దిక్ చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఐపీఎల్ మధ్యలో టీమ్ బస్సులో ఆమె కనిపించడం, దానివల్ల బస్సు ఆలస్యం కావడం వంటి అంశాలు హార్దిక్ ప్రతిష్టను మరింత దెబ్బతీస్తున్నాయి.

ఆటలోనూ అట్టర్ ప్లాప్:
వ్యక్తిగత విమర్శలు ఒకెత్తయితే.. మైదానంలో హార్దిక్ ఆటతీరు మరో ఎత్తు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ పాండ్యా కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్యాటింగ్‌లో కనీసం ఒక్క అర్థసెంచరీ కూడా నమోదు చేయలేదు. బౌలింగ్‌లోనూ 11.16 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుంటూ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అటు కెప్టెన్సీలోనూ, ఇటు ఆల్‌రౌండర్ ప్రదర్శనలోనూ హార్దిక్ పూర్తిగా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్ కొంపముంచుతోంది. జట్టు యాజమాన్యం ఇప్పటికైనా జోక్యం చేసుకుని క్రమశిక్షణను కఠినతరం చేయకపోతే.. ఈ సీజన్‌లో ముంబై కోలుకోవడం అసాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, April 17, 2026, 17:44 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+