Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్‌ 100వ విజయం

IPL 2019 : Mumbai Indians Become First Team To Register 100 IPL Wins || Oneindia Telugu
Mumbai Indians become first team to register 100 IPL wins

ఐపీఎల్ బలమైన జట్లలో ముంబై ఇండియన్స్‌ ఒకటి. ఐపీఎల్‌లో ఎదురులేని జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కూడా చుక్కలు చూపించే ఏకైక జట్టు ముంబై. ఎన్నో రికార్డులు తన పేరిట లించుకుని ఐపీఎల్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ముంబై 2013లో తొలిసారిగా ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2015, 2017లో కూడా టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. బుధవారం వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.

100వ విజయం:
చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై జట్టు ఐపీఎల్ లీగ్‌లో 100వ విజయంను నమోదు చేసింది. మొత్తం 175 మ్యాచులలో 100 విజయాలు (56.85 శాతం) సాధించింది. ఈ జాబితాలో ముంబయి తర్వాత 93 విజయాలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

ఏ జట్టు ఎన్ని విజయాలు:

ముంబయి ఇండియన్స్‌ - 100(175 మ్యాచులు)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ - 93 (152 మ్యాచులు)
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - 88 (167 మ్యాచులు)
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - 79 (166 మ్యాచులు)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - 79 (171 మ్యాచులు)
రాజస్థాన్‌ రాయల్స్ - 71 (137 మ్యాచులు)
దిల్లీ క్యాపిటల్స్‌ - 69 (165 మ్యాచులు)
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ - 83 (171 మ్యాచులు)
రైజింగ్‌ పుణె సూపర్‌ గెయింట్స్‌ - 15 (30 మ్యాచులు)
గుజరాత్‌ లయన్స్ - 13 (30 మ్యాచులు)
పుణె వారియర్స్‌ ఇండియా - 12 (46 మ్యాచులు)
కోచి టస్కర్స్‌ కేరళ - 6 (14 మ్యాచులు)

Story first published: Thursday, April 4, 2019, 12:49 [IST]
Other articles published on Apr 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+