Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి బంతికి పాసైన ముంబై ఇండియన్స్

Ambati Rayudu
బెంగళూరు: ఛాంపియన్స్ లీగ్ టి20లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ఎలాంటి విజయం అంటే నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయాన్ని అందుకొవడం జరిగింది.

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక్క వికెట్ తేడాతో ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రినిడాడ్ అండ్ టుబాగో 16.2 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటయింది. ఓపెనర్ సిమ్మన్స్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్), డారెన్ బ్రేవో (15 బంతుల్లో 18; 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో ట్రినిడాడ్ ఇన్నింగ్స్ సాఫీగానే మొదలైంది. కానీ ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించి, వరుస విరామాల్లో వికెట్లు తీశారు. మిడిలార్డర్‌లో జాసన్ మహమూద్ (27 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఒక్కరూ కుదరుగా ఆడలేదు.

ముంబై కెప్టెన్ హర్భజన్ మూడు కీలక వికెట్లు తీసి ట్రినిడాడ్‌ను దెబ్బతీశాడు. మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో ట్రినిడాడ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టి20ల్లో ఈ కరీబియన్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. స్పిన్నర్‌ నారైన్‌ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్ల పడగొట్టాడు. బద్రి కూడా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అంబటి రాయుడు పోరాటాన్ని కొనసాగించాడు. అద్భుత సమన్వయంతో ఆడిన రాయుడు 47 బంతుల్లో 3ఫోర్లతో 36 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. సుమన్‌ (10), మలింగ (15), సతీష్‌ (14) పరుగులు చేసి తమవంతు పాత్ర పోషించారు. హర్భజన్‌ 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+