తీరు మారని యువీ వారియర్స్, ముంబై ఇండియన్స్‌పై ఓటమి

పుణె లక్ష్యఛేదన కష్టంగా సాగింది. భజ్జీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే రైడర్ వికెట్ కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు వైపు సాగుతున్నట్లనిపించలేదు. 10 ఓవర్లయ్యేసరికి స్కోరు 3 వికెట్లకు 48 పరుగులు మాత్రమే. ఐతే మరోవైపు మనీష్ పాండే (59; 47 బంతుల్లో 4X4, 3X6) నిలబడగా, కెప్టెన్ యువరాజ్ (20; 16 బంతుల్లో 1X4, 2X6) రెండు సిక్స్‌లు బాదడంతో పుణె పుంజుకునేలా కనిపించింది. కానీ కీలక సమయంలో మలింగ (13వ ఓవర్లో) ఓ అద్భుతమైన డెలివరీతో యువరాజ్‌ను ఔట్ చేసి పుణెను దెబ్బతీశాడు. ఆ తర్వాత పాండే, ఉతప్ప (34 నాటౌట్; 26 బంతుల్లో 2X6) మెరుపులు మెరిపించినా ఫలితం కనిపించలేదు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ బ్లిజార్డ్ (6) వికెట్ కోల్పోయింది. ఐతే పుణెకు వెంటనే మరో వికెట్ దక్కలేదు. సచిన్ (24; 24 బంతుల్లో 5X4), రాయుడు (27; 28 బంతుల్లో 2X4) రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. 11వ ఓవర్ ముగిసేసరికి ముంబయి స్కోరు 69 మాత్రమే. ఆ దశలో క్రీజులోకి వచ్చిన సుమన్ రెచ్చిపోయాడు. రైడర్ బౌలింగ్‌లో సిక్స్, యువీ బౌలింగ్‌లో ఫోర్, టేలర్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టాడు. కానీ రోహిత్ శర్మ (12) ధాటిగా ఆడబోయి 15వ ఓవర్లో ఔటయ్యాడు.
ఆ ఓవర్ ముగిసేసరికి స్కోరు 97/5. ఆ తర్వాతి ఓవర్లో (థామస్) రెచ్చిపోయిన సుమన్ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. అదే ఊపులో ఆడబోయి రాహుల్‌శర్మ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. సుమన్ నిష్క్రమణ తర్వాత పుణె బౌలింగ్‌ను తుత్తునియలు చేసే బాధ్యతను పొలార్డ్ తీసుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications