Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ దేవుడు లేకుండా ఛాంపియన్స్ టైటిల్‌ సొంతం

Mumbai Indians
2011 ఛాంఫియన్స్ లీగ్‌లో టైటిల్ ఫేవరెట్ అంతా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అనుకున్నారంతా.. అందుకు కారణం ముంబై ఇండియన్స్ టీమ్‌లో క్రికెట్ దేవుడు లేకపోవడమే. కానీ అంచనాలు తారుమారయ్యాయి. హార్బజన్ సింగ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి ఛాంపియన్స్ లీగ్ టి20లో చాంపియన్‌గా నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కి ప్రారంభంలో ఓపెనర్లు బ్లిజార్డ్, సరుల్‌ కన్వర్ కొంచెం ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు, ఫ్రాంక్లిన్‌ కుదురుగా ఆడారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే 21 బంతుల్లో ఒక ఫోర్‌, సిక్స్‌తో 22 పరుగులు చేసిన రాయుడును భత్కల్‌ ఔట్‌ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ ధాటిగా ఆడాడు. ఫ్రాంక్లిన్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కానీ 17 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసి యాదవ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఫ్రాంక్లిన్‌ 29 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లతో 41 కూడా రన్ అవుట్ అవడం జరిగింది. అలా ముంబై ఇండియన్స్ మొత్తం 20ఓవర్లలలో 139 పరుగులు చేసింది.

ఆ తర్వాత 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు దిల్షాన్ (20 బంతుల్లో 27; ఫోర్లు 5) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించివప్పటికీ మలింగ తన మూడో ఓవర్లో దిల్షాన్‌ను బౌల్డ్ చేయడం జరిగింది. మరోవైపు గేల్ (12 బంతుల్లో 5; ఓ ఫోర్) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ హర్భజన్ బౌలింగ్‌లో ఎల్బీగా దొరికిపోయాడు. సెమీ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌కు విజయాన్నిఅందించిన విరాట్ కోహ్లి (19 బంతుల్లో 11; ఫోర్లు 1), అగర్వాల్ ప్రయత్నించినప్పటికి ముంబై ఇండియన్స్ బౌలర్లు ధాటికి నిలవ లేక పోయారు. పఠిష్టమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో బెంగళూరు ఇన్నింగ్స్ కధ కేవలం 108 పరుగులకు మగిసిపోయింది. ఇక ఛాంపియన్స్ లీగ్ టి20లో ఛాంపియన్స్‌ అయిన ముంబై ఇండియన్స్ రూ.12కోట్ల 25 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకొగా, రెండవ స్దానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్‌కు రూ. 6 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీని అందివ్వడం జరిగింది. ఇక మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌తో పాటు గొల్డెన్ వికెట్‌ని మలింగ సొంతం చేసుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+