Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలిసిన విషయమే కదా.. ఎక్కువ పీకేది ఏమీ ఉండదు! - రోహిత్ ఫామ్‌పై ముంబయి కోచ్!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ వైఫల్యం కూడా.. ముంబయి ఇండియన్స్ ఓటమికి గల కారణాలలో ఒకటి. దీంతో హిట్‌మ్యాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో అతడి పేలవ ప్రదర్శనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ రోహిత్ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు అతడు ఎంజాయ్ చేయాలి
"అండర్-19 క్రికెట్ నుంచి ఇప్పటివరకు, నేను రోహిత్‌తో కలిసి ఆడాను. అతడు ఎన్నో రికార్డులను సృష్టించాడు. చరిత్ర సృష్టించాడు. అన్నీ ఫార్మాట్లలోనూ భిన్న పరిస్థితులు తానేంటోనిరూపించుకున్నాడు. అతడు లెజెండ్. వ్యక్తిగతంగా కూడా అతడో గొప్ప వ్యక్తి. కొన్ని సార్లు ఆటగాళ్లు తక్కువ స్కోర్లు చేయొచ్చు. కానీ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. ఇప్పుడు అతడు ఒత్తిడిని తగ్గించుకుని ఆటను ఎంజాయ్ చేయాల్సిన సమయం వచ్చింది. అయినా క్రికెట్‌లో మనం ఎక్కువ సార్లు విజయాలు సాధించడం కన్నా విఫలమవుతాం అన్న సంగతి విషయమే కదా. కాబట్టి తక్కువ స్కోర్ చేసినప్పుడు మనం అతడిని జడ్జ్ చేయకూడదు. రోహిత్ త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. అప్పుడు అదే విమర్శకులు అతడిని పొగుడుతారు. అప్పుడు మళ్లీ మనం మరో కొత్త హాట్ టాపిక్‌ పై చర్చ జరుపుతాం. అని పొలార్డ్ అన్నాడు.

Mumbai Indians Batting coach Kieron Pollard comments on Rohit Sharma poor perform in IPL 2025

అప్పుడే లెజెండ్ అవుతాం..
ముంబై ఇండియన్స్ తమ బెస్ట్ ఫామ్‌ను అందుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తోందని పొలార్డ్ తెలిపాడు. జట్టును ముందుకు నడిపించాలంటే పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఎంతో కీలకమని పేర్కొన్నాడు. "ఎప్పుడైనా అనుకున్నట్లుగా పరిస్థితులు లేకపోతే వాటిని అర్థం చేసుకుని, త్వరగా మార్చుకోవడం నాకు, మా జట్టుకు ఎంతో ముఖ్యం. ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా మారడం చాలా ముఖ్యమైన విషయం. ఒక మాజీ ఆటగాడిగా, మేనేజ్‌మెంట్ సభ్యుడిగా, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండటం ముఖ్యం. మన నియంత్రణలో ఉన్న వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ పిచ్ స్వభావాన్ని, ఆట పరిస్థితులను మనం నియంత్రించలేం. అందుకే, ఏ పరిస్థితి ఎదురైనా దానికి అనుగుణంగా జట్టు ఆడాలి. అలా మారడం వల్లే ఆటగాళ్లు ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా, లెజెండ్లుగా మారగలుగుతారు." అని పొలార్డ్ అభిప్రాయపడ్డాడు.

కాగా, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, ఆ జట్టు అభిమానులు.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తే, జట్టుకు బలమైన విజయాలు అందుతాయని ఆశిస్తున్నారు. ఇలాగే పొలార్డ్ రోహిత్‌కు అండగా నిలవడం, అతడిపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయడం కూడా జట్టుకు మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నాడు. చూడాలి మరి రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ మోడ్‌లోకి ఎప్పుడు తిరిగి వస్తాడో.. ముంబయి ఇండియన్స్ మున్ముందు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..

Story first published: Friday, April 4, 2025, 16:53 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+