For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలవడం పక్కా.. 11 మంది మ్యాచ్ విన్నర్లే: మాజీ క్రికెటర్

IPL 2025: ఈ సారి ఐపీఎల్ ట్రోఫీని ఓ జట్టు గెలుస్తుందో భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ముంబై ఇండియన్స్ జట్టులో అత్యధిక మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. జట్టులోని ప్రతి ఒక్కరికి మ్యాచ్ గెలవగల సామర్థ్యం ఉందని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 తొలి అర్థభాగంలో ముంబై ఇండియన్స్ దారుణంగా ఆడింది. ముంబై ఆడిన మొదటి 5 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచారు. ఆ తర్వాత తమ చివరి 6 మ్యాచ్‌లలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టులోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆటగాళ్లందరూ బాగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బౌలర్లు చాలా వికెట్లు పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు బలహీనంగా ఉందని చెప్పడం ఇప్పుడు అసాధ్యం.

Mumbai Indians Are Unstoppable All 11 Players Are Match Winners Says Harbhajan Singh

దీని గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ గెలవకపోతే.. మరే జట్టుకు ఐపీఎల్ గెలిచే హక్కు లేదని అన్నాడు. తాను జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టులో ఉండటం గురించి మాత్రమే మాట్లాడడం లేదన్నాడు. బుమ్రా ఒక్కడే ఒక బాహుబలి లాంటివాడని ప్రశంసించాడు. అలాగే జట్టులో ట్రెంట్ బౌల్ట్, దీపక్ సాగర్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, కరణ్ శర్మ, కార్బిన్ జోష్ లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారన్నాడు. ఈ సంవత్సరం ట్రోఫీని గెలుచుకునే జట్టు వారి వద్ద ఉందన్నాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుదేనని.. ఏ జట్టు కూడా వారిని అందుకోలేదన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీని గెలవడం ఖాయమని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో 11 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారన్నాడు. వారు ఐదు సార్లు మ్యాచ్ విజేతలు అని.. వారి జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారన్నాడు. మూడు సాధారణ ఐపీఎల్ సీజన్ల తర్వాత ముంబై ఇండియన్స్ తిరిగి విజేతల ట్రాక్ లోకి వచ్చిందని హర్భజన్ సింగ్ అన్నాడు.

Story first published: Friday, May 2, 2025, 15:01 [IST]
Other articles published on May 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+