MI vs RCB: ఈ లెక్కన ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పదా?

చెన్నై: అరవ గడ్డపై అదిరిపోయే క్రికెట్​ హంగామా.. గ్రాండ్​ చెపాక్ నైట్స్​లో.. హీటెక్కించే వేడిలో.. మోతెక్కనున్న పరుగుల ఆట.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫ్యాన్స్​ సందడి లేకపోయినా.. చీర్​ గాళ్స్​​ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. బాదుడుకు మాత్రం కొదువలేదన్నట్లుగా సందడి చేసేందుకు ముస్తాబైంది. కరోనాను పక్కనబెడుతూ.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మనముందుకు వచ్చేస్తోంది. డిఫెండింగ్ చాంపియన్స్, ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి పోరుతో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది.

 గత 8 ఏళ్లుగా శుభారంభం లేదు

గత 8 ఏళ్లుగా శుభారంభం లేదు

అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ను ఓ చెత్త రికార్డు వెంటాడుతుంది. అది ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఆందోళన రెకిత్తిస్తోంది. ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌ శైలి‌. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఏనిమిది సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్‌‌ నెగ్గింది. ఈ ఐదు ట్రోఫీలు‌ రోహిత్‌‌ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం.

అయితే ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఇప్పుడిదే ఆ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. ఇరు జట్లను ఓసారి పరిశీలిస్తే.. ఈ మ్యాచ్​లో ముంబై ఫేవరెట్​. స్లో స్టార్టర్​ అని పేరున్నా.. పేపర్​ మీద చూస్తే చాలా బలమైన జట్టు వాళ్ల సొంతం. కానీ గత 8 సీజన్లలో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. మరీ ఈ సారైనా శుభారంభం చేస్తుందా? లేక ఈ చెత్త రికార్డును కంటిన్యూ చేస్తుందా? చూడాలి. చివరిసారిగా ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌‌ను 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌పై నెగ్గింది. మరోసారి అదే జట్టుతో ఈ మెగా టోర్నీని ఆరంభిస్తున్న ముంబై.. ఈ చెత్త రికార్డు చెరిపేసుకుంటుందో లేదో చూడాలి.

2013లో స్టార్టింగ్ ట్రబుల్ షురూ..

2013లో స్టార్టింగ్ ట్రబుల్ షురూ..

2013లో ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ 2 పరుగులతో ఓటమిపాలైంది. 156 రన్స్‌ పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 రన్స్ చేయలేక చేతులెత్తేసింది. అప్పటి ఆర్‌సీబీ బౌలర్ వినయ్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ గట్టెక్కింది. కానీ ఆ సీజన్‌లో ముంబై తొలి టైటిల్ అందుకోవడం విశేషం. అనంతరం 2014 సీజన్‌లో కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన 41 రన్స్‌తో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. రోహిత్, అంబటి రాయుడు రాణించినా విజయాన్నందుకోలేకపోయింది. ఈ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ అందుకుంది.

అయితే ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఇప్పుడిదే ఆ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. ఇరు జట్లను ఓసారి పరిశీలిస్తే.. ఈ మ్యాచ్​లో ముంబై ఫేవరెట్​. స్లో స్టార్టర్​ అని పేరున్నా.. పేపర్​ మీద చూస్తే చాలా బలమైన జట్టు వాళ్ల సొంతం. కానీ గత 8 సీజన్లలో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. మరీ ఈ సారైనా శుభారంభం చేస్తుందా? లేక ఈ చెత్త రికార్డును కంటిన్యూ చేస్తుందా? చూడాలి. చివరిసారిగా ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌‌ను 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌పై నెగ్గింది. మరోసారి అదే జట్టుతో ఈ మెగా టోర్నీని ఆరంభిస్తున్న ముంబై.. ఈ చెత్త రికార్డు చెరిపేసుకుంటుందో లేదో చూడాలి.

2015లోనూ శుభారంభం దక్కలేదు..

2015లోనూ శుభారంభం దక్కలేదు..

ఇక 2015లో కేకేఆర్‌తో సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై శుభారంభాన్ని అందుకోలేకపోయింది. ప్రత్యర్థి ముందు ఉంచిన 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కేకేఆర్ 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ చేజ్ చేసి 7 వికెట్లతో విజయాన్నందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సీజన్‌లో ముంబై రెండో టైటిల్ కైవసం చేసుకుంది. 2016లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మళ్లీ సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. రైజింగ్ పుణె సూపర్ గెయింట్స్ చేతిలో కంగుతిన్నది. ఈ మ్యాచ్‌లో ముంబై అత్యల్ప స్కోర్ నమోదు చేయగా.. పుణె 9 వికెట్లతో 5 ఓవర్లు మిగిలుండగానే చేధించింది.

అదే సీన్ రిపీట్...

అదే సీన్ రిపీట్...

ఇక 2017, 18, 19, 20 సీజన్లలో కూడా ముంబై శుభారంభాన్ని అందుకోలేదు. కానీ 2017, 19, 20 సీజన్లలో టైటిల్ గెలుచుకొని సత్తా చాటింది. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తొలి మ్యాచ్ ఆడిన ముంబై 7 వికెట్లతో ఓడిపోయింది. 184 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. 2018లో ఆర్‌సీబీ‌తో తొలి మ్యాచ్ ఆడగా.. 1 వికెట్‌తో ఓటమిపాలైంది. 165 పరుగుల స్కోర్‌ను కాపాడుకోలేక చేతులెత్తేసింది. 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన ముంబై 37 రన్స్‌తో ఓటమిపాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. కానీ ఆఖర్లో అదరగొట్టి టైటిల్ పట్టింది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్ ఆడిన ముంబై.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై 162 పరుగులే చేయగా.. చెన్నై నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. మరి ఈ సారి అయినా ఈ స్టార్టింగ్ ట్రబుల్‌కు చెక్ పెడ్తుతుందో లేదో చూడాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 18:05 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X