Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముహూర్తం కుదిరింది: డిసెంబరు 27న పెళ్లి పీటలు ఎక్కనున్న పాండ్యా

Mumbai Indians All-Rounder Krunal Pandya to Get Married Next Month

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. భారత జట్టులో ఇప్పుడిప్పుడే కీలక ఆటగాడిగా ఎదుగుతున్న హార్ధిక్ పాండ్యా సోదరుడే ఈ కృనాల్ పాండ్యా. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కృనాల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ పంకురి శర్మను డిసెంబరు 27న పెళ్లాడనున్నాడు.

ఈ విషయాన్ని కృనాల్‌ స్వయంగా వెల్లడించాడు. ముంబైలోని శాంట క్రూజ్‌ హోటల్‌లో కుటుంబసభ్యుల మధ్య ఈ పెళ్లి జరగనుందని కృనాల్ వెల్లడించాడు. ఈ పెళ్లికి అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలిపాడు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్‌ ఉన్నట్లు కృనాల్‌ తెలిపాడు.

Mumbai Indians All-Rounder Krunal Pandya to Get Married Next Month

రెండు సంవత్సరాల క్రితం కృనాల్‌ తొలిసారి పంకురిని కలిశాడు. తన స్నేహితుడి ద్వారా పంకురితో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి స్నేహం పెళ్లికి దారితీసింది. ఈ సందర్భంగా కృనాల్ మాట్లాడుతూ 'ఆమెలో నాకు రెండు గుణాలు బాగా నచ్చాయి. ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉంటుంది' అని కృనాల్ అన్నాడు.

అన్ని విషయాల్లో తనకు మద్దతుగా నిలుస్తుందని, స్నేహితుల కంటే ఎక్కువగా ఇష్టపడే, అర్థం చేసుకునే అమ్మాయితో నాకు వివాహం జరగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కృనాల్ తెలిపాడు. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వారి వివాహానికి ముహూర్తం ఖరారైంది.

Story first published: Monday, November 20, 2017, 17:26 [IST]
Other articles published on Nov 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+