Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ 5గురు ప్లేయర్లకు ముంబై టీమ్ టాటా..బైబై!

ఐపీఎల్ 2026 సీజన్లో 5సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి.. ఏకంగా 9 మ్యాచ్‌ల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. గత ఆరేళ్లుగా ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేకపోయిన ముంబై యాజమాన్యం.. 2027 మెగా వేలానికి ముందు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జట్టులోని కొందరు అగ్రశ్రేణి ప్లేయర్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ జాబితాలో ఉన్న ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ విడుదల చేయబోయే ప్లేయర్ల జాబితాలో మొదటి పేరు.. అందరినీ షాక్ గురిచేసే పేరు కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే. ఫ్రాంచైజీ ఎంతో నమ్మకంతో రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. కానీ పాండ్యా కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ కనీస ప్రభావం చూపలేకపోయాడు. దీనికి తోడు మైదానంలో హార్దిక్ వ్యూహాలు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు రావడంతో ముంబై భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను వదిలేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Mumbai Indians 5 Star Players Might Release Before IPL 2027 Mega Auction Hardik Pandya on List

సూర్యకుమార్ యాదవ్
టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా వచ్చే సీజన్లో వదిలిపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో సూర్య తన ఫామ్ అందుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రావడం పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న సూర్య స్థానంలో భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ముంబై యాజమాన్యం భావిస్తోంది. అందుకే సూర్యను విడుదల చేయాలనే కఠిన నిర్ణయానికి ముంబై యాజమాన్యం వచ్చే అవకాశం ఉంది.

దీపక్ చాహర్
భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఈ సీజన్‌లో ముంబైకి పెద్ద తలనొప్పిగా మారాడు. ముంబై ఇండియన్స్ ఇతనిని రూ. 9.25 కోట్ల భారీ మొత్తానికి జట్టులోకి తెచ్చుకుంది. కానీ దీపక్ చాహర్ అటు పవర్‌ప్లేలోనూ, ఇటు డెత్ ఓవర్లలోనూ పరుగులు భారీగా సమర్పించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసిన దీపక్ చాహర్.. ఏకంగా 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా దీపక్ చాహర్‌పై వేటు పడటం ఖాయమైంది.

షెర్పేన్ రూథర్‌ఫోర్డ్
విదేశీ ప్లేయర్ల కోటాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ స్థానం కూడా ప్రమాదంలో పడింది. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేస్తూ మ్యాచ్‌లను ఫినిష్ చేస్తాడనే నమ్మకంతో అతనికి బాధ్యతలు అప్పగించారు. కానీ రూథర్‌ఫోర్డ్ వరుసగా తక్కువ పరుగులకే ఔట్ అవుతూ నిరాశపరిచాడు. జట్టును గెలిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకపోవడంతో వచ్చే సీజన్ కోసం అతడిని కొనసాగించేందుకు ఫ్రాంచైజీ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

రాబిన్ మింజ్
యువ క్రికెటర్ రాబిన్ మింజ్‌పై కూడా జట్టు యాజమాన్యం నమ్మకం సడలింది. వేలంలో రూ. 65 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ యువ ప్లేయర్‌కు ఈ సీజన్‌లో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాలను రాబిన్ మింజ్ ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో రాణించలేకపోవడమే కాకుండా తుది జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో వచ్చే వేలానికి ముందే అతడిని కూడా ముంబై విడుదల చేయనుంది.

Story first published: Thursday, May 21, 2026, 12:08 [IST]
Other articles published on May 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+