Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోజుకు 150 సిక్సర్లు.. ఈ పేరు గుర్తుపెట్టుకోండి!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత.. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ముకుల్ చౌదరి. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ముకుల్ చౌదరి సూపర్ హీరోగా మారి తన బ్యాటింగ్‌తో కేకేఆర్ చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే 7 భారీ సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ముకుల్ చౌదరి.. తన పవర్‌ఫుల్ హిట్టింగ్ వెనుక ఉన్న రహస్యాలను వెల్లడించాడు.

ప్రతిరోజూ 150 సిక్సర్ల ప్రాక్టీస్
తాను అంత అలవోకగా సిక్సర్లు ఎలా బాదగలుగుతున్నాడనే విషయంపై ముకుల్ చౌదరి స్పందిస్తూ.. "నా శరీర దారుఢ్యం సహజంగానే కొంచెం ఎక్కుగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ 100 నుంచి 150 సిక్సర్లు కొట్టేలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తాను. ఇలా నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాట్ స్వింగ్ వేగం పెరుగుతుంది. గత ఐదారు నెలలుగా నేను చేస్తున్న ఈ సాధనే ఇప్పుడు మైదానంలో ఫలితాలను ఇస్తాంది" అని ముకుల్ చౌదరి వివరించాడు.

Mukul Choudhary Secret 150 Sixes Daily Practice and Dhoni Helicopter Shot Stun KKR in IPL

ధోనీ స్ఫూర్తితో హెలికాప్టర్ షాట్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తన ఆదర్శంగా భావించే ముకుల్ చౌదరి.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీకి పేటెంట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను కూడా ఆడి అందరిని అలరించాడు. దీనిపై ముకుల్ చౌదరి మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచే నాకు ఆ షాట్ అంటే చాలా ఇష్టం. ధోనీ ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసే తీరు నన్ను బాగా ఆకట్టుకునేది. యార్కర్ బంతులను కూడా సిక్సర్లుగా మలిస్తే బౌలర్ ఒత్తిడిలోకి వెళ్లి వేరే రకంగా ఆలోచించడం మొదలుపెడతాడు. అందుకే ఆ షాట్ ను నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటాను" అని ముకుల్ చౌదరి వెల్లడించాడు.

ముకుల్ కళ్లలో ఆకలి కనిపిస్తోంది: కోచ్ జస్టిన్ లాంగర్
ముకుల్ చౌదరి ఆటతీరుపై లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ అమితానందం వ్యక్తం చేశారు. "ముకుల్ చాలా యువ ఆటగాడు, అతని కళ్లలో విజయం సాధించాలనే తపన, ఆకలి కనిపిస్తోంది. అతని కెరీర్‌లో ఇదొక గొప్ప మలుపు" అని కోచ్ జస్టిన్ లాంగర్ కొనియాడారు. నాలుగు నెలల్లో ముకుల్‌ను భారత్‌లోనే అత్యంత ప్రమాదకరమైన నంబర్ 6 లేదా నంబర్ 7 బ్యాటర్‌గా తీర్చిదిద్దుతానని లాంగర్ ఇదివరకే ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

వేలంలో 2.6 కోట్లకు సొంతం
దేశీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున నిలకడగా రాణిస్తున్న ముకుల్ చౌదరిని ఐపీఎల్ 2026 మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. తాను పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగానే ముకుల్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముకుల్ సిక్సర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి

Story first published: Friday, April 10, 2026, 15:36 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+