Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని కొట్టిన ముఖేశ్ చౌదరి.. కావాలని కొట్టలేదని సారీ కూడా చెప్పాడు

Mukesh Choudhary says sorry to Virat Kohli for hitting him with ball

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కొట్టినందుకు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముఖేష్ చౌదరి పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే మళ్లీ సారీ బ్రో అంటూ క్షమాపణలు కూడా చెప్పాడు. అసలు ఇంతకు కోహ్లీని ముఖేశ్ చౌదరీ ఎందుకు కొట్టాడు.. ఎలా కొట్టాడు.. అసలు క్రికెట్లోనే అతి పెద్ద స్టార్ అయిన కోహ్లీని కొట్టే దమ్ము.. మొన్నమొన్నా క్రికెట్లో అడుగుపెట్టిన ముఖేష్ చౌదరికి ఎక్కడిది? ఇన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయా.. అవునండీ నిజంగానే కోహ్లీని ముఖేష్ కొట్టాడు. ఎలాగంటే..

 క్రీజులో ఉన్న కోహ్లీ అనవసర రన్ కోసం..

క్రీజులో ఉన్న కోహ్లీ అనవసర రన్ కోసం..

కోహ్లీ క్రీజులో ఉండగా.. తొలి ఓవర్ బౌలింగ్ వేసిన ముఖేష్ చౌదరీ బంతిని డైవ్ చేసిన కోహ్లీ.. రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ముఖేష్ లాంగ్ ఆన్ దిశగా వెళ్తున్న బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. వెంటనే కోహ్లీ వెనక్కి తిరిగి క్రీజు వైపు మళ్లాడు. ఇక కోహ్లీని రనౌట్ చేయాలని చూసిన ముఖేష్.. కోహ్లీ సైడ్ ఉన్న వికెట్ల వైపు బంతిని వేగంగా విసిరాడు. అయితే ఆ బంతి కోహ్లీ తొడలకు బలంగా తాకింది. దీంతో కాస్త ఆందోళప పడ్డ ముఖేష్.. కోహ్లీ వంక చూస్తూ సారీ బ్రో అంటూ పేర్కొన్నాడు. ఇక కోహ్లీ సైతం పర్లేదు ముఖేష్ నువ్వేం కావాలని చేయలేదుగా అన్నట్లు చిరునవ్వుతో బదులిచ్చాడు.

 ఈ సీజన్లో ఆకట్టుకుంటున్న ముఖేష్ చౌదరి

ఈ సీజన్లో ఆకట్టుకుంటున్న ముఖేష్ చౌదరి

ఈ ఐపీఎల్ సీజన్లో ముఖేశ్ చౌదరి.. బాగా ఆకట్టుకుంటున్నాడు. సీఎస్కేకు ఈ సీజన్లో దీపక్ చాహర్ దూరం కావడంతో ఈ యువ పేసర్ అతని స్థానంలో బరిలోకి దిగాడు. రెండు మూడు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్స్ పర్‌ఫార్ఫర్మెన్స్ చేశాడు. ఇక ముఖేష్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 11వికెట్లు తీశాడు. పవర్ ప్లేలో మంచి ఎకానమీతో బౌలింగ్ వేస్తున్నాడు. ఈ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో ముఖేష్ కూడా ఒకరు. అతని బేస్ ప్రైస్ రూ.20లక్షలు మాత్రమే.

మరోసారి కోహ్లీ బాగా తడబడ్డాడు

మరోసారి కోహ్లీ బాగా తడబడ్డాడు

కోహ్లీ తిరిగి తన ఫామ్ అందుకున్నాడంటూ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అనంతరం అందరూ అనుకున్నారు. కానీ మునుపటిలా కోహ్లీ బ్యాటింగ్ లో దూకుడు కన్పించడం లేదు. టీ20ఫార్మాట్లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో 33బంతులు ఆడిన కోహ్లీ కేవలం 30పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌‌లో 3ఫోర్లు, 1సిక్సర్ కొట్టాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా తడబడుతూ కన్పించాడు. అయితే డుప్లెసిస్‌తో మంచి పార్ట్‌నర్‌షిప్ నమోదు చేయడంలో మాత్రం కోహ్లీ మంచి స్ట్రైక్ రొటేషన్ కనబరిచాడు.

ఆర్సీబీ 20ఓవర్లు ముగిసేసరికి..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు కోల్పోయి 173పరుగులు చేసింది. డుప్లెసిస్ (22బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్‌తో 38పరుగులు), మహిపాల్ లోమ్రోర్ (27బంతుల్లో 42పరుగులు) రాణించారు. చివర్లో రజత్ పాటిదర్ (21పరుగులు), దినేశ్ కార్తీక్ (26పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఇక చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ 2వికెట్లతో రాణించగా.. మహేష్ తీక్షణ 3వికెట్లు తీసి రాణించాడు

Story first published: Wednesday, May 4, 2022, 22:52 [IST]
Other articles published on May 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+