Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 సెకన్లకు రూ.20 లక్షలు! -IPL 2025తో ముకేశ్ అంబానీ ఆదాయం ఎన్ని వేల కోట్లంటే?

ఐపీఎల్ 2025 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడా ప్రియులను ఆకర్షించిన ఈ రిచెస్ట్ మెగా లీగ్ కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి ఇంకా ఐపీఎల్ ఆన్ ఫీల్డ్ మ్యాచెస్ ప్రారంభం కాకుండానే కొన్ని అంశాలు వార్తల్లో చర్చనీయాంశంగానూ, ప్రత్యేక ఆకర్షణగానూ నిలిచాయి. ఎప్పుడూ కాసుల వర్షం కురిపించే ఈ ఐపీఎల్.. ఈ సారి కూడా మెగా ఆక్షన్, బ్రాడ్‌కాస్ట్ రైట్స్ ధరలతో రికార్డు స్థాయిలో పైసల మోత మెగించింది.

ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ 2025లో ఆయా జట్లకు యాడ్ రెవెన్యూ విషయంలో స్పాన్సర్‌షిప్స్ నుంచి వచ్చే ఆదాయం ఎంత? టీవీ బ్రాడ్‌కాస్టింగ్, ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ ఎన్ని వేల కోట్ల ఇన్‌కమ్ పొందనుంది? వంటి వివరాలు తెలిశాయి.

10 సెకన్లకు రూ.20 లక్షలు
రిలయన్స్‌కు చెందిన జియోస్టార్ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను 2023-2028 వరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోన్న ఈ బ్రాడ్‌కాస్టింగ్ వల్ల యాడ్స్ స్లాట్ బుకింగ్ ధరలు పెరిగాయట. గత ఏడాదితో పోలిస్తే 25-30శాతం పెరిగినట్లు తెలిసింది. దీంతో ఈ ఐపీఎల్ 2025 ద్వారా రిలయన్స్ జియోస్టార్ రికార్డ్ బ్రేకింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూను అందుకోనుంది తెలిసింది. కొన్ని ఇంగ్లీష్ రిపోర్టుల ప్రకారం.. టెలివిజన్ లో (SD+HD) 10 సెకన్ల యాడ్ ధర రూ.18-19 లక్షలు ఉందట. గతేడాది ఇదే స్లాట్ ధర రూ.16.4 లక్షలుగా ఉంది.

Mukesh Ambani s Reliance Jiostar may earn 6000 crores In IPL Ad Revenue

మొత్తం ఎన్ని వేల కోట్లంటే?
ఐపీఎల్ 2025 మొత్తం ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు జనరేట్ అవుతుందని అంచనా. టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, టీమ్ స్పాన్సర్ షిప్స్, ఆన్ గ్రౌండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇలా ఇన్ని కలిపి రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు వస్తుందని చెబుతున్నారు. ఇందులో జియో హాట్‌స్టార్ కే రూ.4,500 కోట్ల వరకు వస్తుందని తెలిసింది.

ఇంకా ఐపీఎల్ 2025లో పాల్గొనే 10 ఐపీఎల్ టీమ్స్, బీసీసీఐ బోర్డు కూడా యాడ్ రెవెన్యూ విషయంలో ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా బానే ఆర్జించనున్నాయి. ఐపీఎల్ జట్లు రూ.1,300 కోట్లు, బీసీసీఐ రూ.800-900 కోట్లు సంపాదిస్తాయని అంచనా. ముంబయి, చెన్నై, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ (చెరో రూ.150 కోట్ల వరకు) ఎక్కువ స్పాన్సర్ షిప్ రెవెన్యూను అందుకుంటున్నాయట.

Story first published: Friday, March 14, 2025, 10:12 [IST]
Other articles published on Mar 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+