For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముజీబ్ ఉర్ రెహ్మాన్...: మ్యాజికల్, మిస్టీరియస్ స్పిన్నర్ గురించి

By Nageshwara Rao
Mujeeb Ur Rahman: magical, mysterious

హైదరాబాద్: ముజీబ్ ఉర్ రెహ్మాన్... ఐపీఎల్ 11వ సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన ముజీబ్‌కు ఈ సీజన్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునేలా చేసింది.

ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ముజీబ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 4 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఈ కొనుగోలు అటు మాజీ క్రికెటర్లతో పాటు చాలా మంది క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అప్పుడు ముజీబ్ వయసు 16 ఏళ్లే.

 ముజీబ్‌కు అంతర్జాతీయ అనుభవం కూడా తక్కువ

ముజీబ్‌కు అంతర్జాతీయ అనుభవం కూడా తక్కువ

అంతేకాదు అంతర్జాతీయ అనుభవం కూడా తక్కువ. అయితే పంజాబ్ జట్టు మెంటార్ అతడిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్‌లో ముజీబ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌కు వేసిన క్యారమ్‌ బంతి కానీ.. స్టోక్స్‌ను పెవిలియన్‌ చేర్చిన దుస్రాలే ముజీబ్‌ను మిస్టరీ స్పిన్నర్‌గా మార్చాయి.

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన పిన్నవయస్కుడు

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన పిన్నవయస్కుడు

17 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన పిన్నవయస్కుడు ముజీబ్‌. ఐపీఎల్‌ కంటే ముందు అండర్‌-19లో సత్తా చాటాడు. అండర్‌-19 ఆసియాకప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి అఫ్ఘనిస్థాన్ కప్‌ గెలవడంలో ముజీబ్‌ కీలకపాత్ర పోషించాడు. పాక్‌‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన ముజీబ్, అంతకముందు నేపాల్‌తో జరిగిన సెమీస్‌లో ఆరు వికెట్లు తీశాడు.

 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయడంతో వెలుగులోకి

5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయడంతో వెలుగులోకి

ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక, ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్‌-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌తో క్వార్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ఆప్ఘనిస్థాన్‌ను సెమీ పైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

 క్రిస్‌ గేల్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం

క్రిస్‌ గేల్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం

2019 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్‌ టోర్నీలోనూ ముజీబ్‌ కీలకపాత్ర పోషించాడు. వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ను ఔట్‌ చేసిన తీరు మాజీ క్రికెటర్లను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆఫ్‌ స్పిన్‌ యాక్షన్‌తో వచ్చిన ఆ లెగ్‌బ్రేకర్‌ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన గేల్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

ముజీబ్ ఖాతాలో మరో రికార్డు

ముజీబ్ ఖాతాలో మరో రికార్డు

ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఖాతాలో మరో రికార్డు ఉంది. ఐర్లాండ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముజీబ్ 21వ శతాబ్దంలో పుట్టి.. వన్డే ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 28 మార్చి 2001లో జన్మించిన 17 ఏళ్ల ముజీబ్ ఈ మ్యాచ్‌లో ముజీబ్ 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తద్వారా 21వ శతాబ్దంలో జన్మించి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా ముజీబ్ అరుదైన ఘనత సాధించాడు.

 ముజీబ్‌కు ఇంగ్లిష్‌ రాదు

ముజీబ్‌కు ఇంగ్లిష్‌ రాదు

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో చైనామన్‌ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్ల హవా నడుస్తున్న సమయంలో వేళ్లతో భలేగా బంతిని తిప్పుతూ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్వయంగా ఆఫ్‌స్పిన్నర్‌ కావడం కూడా ముజీబ్‌ మెరుగైన ప్రదర్శనకు మరో కారణం. ఇక్కడ విశేషం ఏంటేటే ముజీబ్‌కు ఇంగ్లిష్‌ రాదు. హిందీ కూడా అర్థం కాదు.

Story first published: Tuesday, May 8, 2018, 16:29 [IST]
Other articles published on May 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+