For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: ముజీబ్ మ్యాజిక్‌కు పంత్‌కు పంచ్ పడింది (వీడియో)

Mujeeb Ur Rahman foxes Rishabh Pant off a magical delivery

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్లా వేదికగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఇందులో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు పరాజయం పాలైంది. 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు 139 పరుగులకే పరిమితమై మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. కానీ మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ చివరి వరకూ విజయం కోసం పోరాడాడు. పంజాబ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ తొలి బంతికి ముజీబ్ రెహ్మాన్ అద్భుతమైన డెలివరీతో రిషబ్ పంత్‌ను ఔట్ చేశాడు.

భారీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం ఉన్న పంత్ 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముజీబ్ విసిరిన బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది. శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో (57)కు రాహుల్ తెవాతియా (24) అండగా ఉన్నప్పటికీ.. చివర్లో ఒత్తిడి పెరగడంతో ఢిల్లీ ఓటమిపాలైంది.

చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో పంజాబ్ జట్టు ముజీబ్ రెహ్మాన్ బౌలింగ్‌కు దిగాడు. శ్రేయస్ అయ్యర్ ఓ సిక్స్, ఫోర్ బాదడంతోపాటు రెండు పరుగులు తీయగలిగింది ఢిల్లీ. గెలవాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. కానీ శ్రేయస్ భారీ షాట్‌కు యత్నించి ఔటవడంతో.. పంజాబ్ గెలుపొందింది.

Story first published: Tuesday, April 24, 2018, 15:58 [IST]
Other articles published on Apr 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+