పంత్‌కు బ్యాకప్ ఆటగాళ్లు! మూడో టీ20లో విఫలమైతే ఇక అంతే!

హైదరాబాద్: సొంతగడ్డపై సఫారీలతో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు బ్యాకప్ ఆటగాళ్లను తయారు చేస్తున్నామని ఛీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. మూడు ఫార్మాట్లలో రిషబ్ పంత్ పనిభారాన్ని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
భారత జట్టులో ధోని తర్వాత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను తీర్చిదిద్దే క్రమంలో అతడికి జట్టు మేనేజ్‌మెంట్ ఎన్నో అవకాశాలను ఇస్తోంది. అయితే, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో రిషబ్ పంత్ విఫలమవుతున్నాడు. దీంతో సెలెక్షన్ కమిటీ సైతం రిషబ్ పంత్ బ్యాకప్ కోసం కసరత్తు ప్రారంభించింది.

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ
ఇందులో భాగంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత పంత్ మెరుగుదలపై దృష్టి పెడతామని నేను ముందే చెప్పాను. అతడు అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ప్రతిభను పరిగణనలోకి తీసుకుని మనం అతడి ప్రదర్శనపై కాస్త ఓపికగా ఉండాలి. అంతేకాదు అతడి పనిభారాన్ని మేం పర్యవేక్షిస్తున్నాం" అని తెలిపారు.

పంత్‌కు బ్యాకప్ ఆటగాళ్లు
"అన్ని ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్‌కు బ్యాకప్ ఆటగాళ్లను తయారు చేస్తున్నాం. ఇండియా-ఏ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో యువ ఆటగాడు కేఎస్ భరత్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ఇండియా-ఏ, దేశవాళీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లు కూడా ఉన్నారు" అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో
టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించిన రిషబ్ పంత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు. ఎప్పుడూ ఒకే తరహా షాట్‌కు ఔటవ్వడంపై పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా డీప్ స్వేర్ లెగ్‌లో పంత్ ఔటవుతున్న తీరు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో అతడిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications