Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MSK Prasad: కోహ్లీ మాత్రమే కాదు రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకోవాలి

 kohli and rohit should take rest msk prasad says

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో చాలా తడబడుతున్నాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్.. ప్లేయర్‌గా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. పెద్ద స్కోర్లు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ సీజన్లో వరుసగా రెండు సార్లు గోల్డెన్ డక్‌ ఔట్ అయ్యాడు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ.. మళ్లీ గాడిలో పడ్డాడని అందరూ అనుకుంటున్న వేళ.. నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కేవలం 33బంతుల్లో 30పరుగులు మాత్రమే చేశాడు.

కోహ్లీకి ప్రస్తుతం ఆట కన్నా విశ్రాంతే కీలకం

కోహ్లీకి ప్రస్తుతం ఆట కన్నా విశ్రాంతే కీలకం

కోహ్లీ ప్రస్తుత పేలవ ఫామ్ చూసి.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రితో సహా చాలా మంది క్రికెట్ ప్రముఖులు కోహ్లీ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆట కన్నా విశ్రాంతి తీసుకోవడమే మేలంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన ఎంఎస్కే ప్రసాద్.. పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుత టఫ్ టైంలో కోహ్లీ తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ముందున్న ఆసియా కప్ కోసం సన్నద్ధం కావాలంటే కోహ్లీ రిఫ్రెష్ కావాల్సిన అవసరముందన్నాడు.

రోహిత్ సైతం విరామం తీసుకోవాలి

రోహిత్ సైతం విరామం తీసుకోవాలి

ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయం ప్రకారం.. 'విరాట్ ఈ టైంలో సరైన విరామం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. త్వరలో జరగబోయే ఆసియా కప్‌కు ముందు అతను రిఫ్రెష్ అయి అప్ అండ్ రన్నింగ్‌గా ఉండాలి. కేవలం కోహ్లీ మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం ఫామ్‌లో లేరు. రాబోయే టీ20 ప్రపంచ కప్ సమయంలో భారత లైనప్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ అత్యంత ప్రాధాన్య ఆటగాళ్లు. వాళ్లు ఆ టోర్నీ టైంకి తప్పకుండా రిఫ్రెష్ అయి ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్‌ పరంగా.. ఓపెనింగ్ స్లాట్‌‌లో శిఖర్ ధావన్‌ ఉండాలి. ధావన్ ప్రస్తుతం చక్కటి టచ్‌లో కన్పిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లలో ధావన్ 46.13సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ధావన్ ఇప్పటివరకు ఆడిన 10మ్యాచ్‌లలో 369పరుగులు చేశాడు.' అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు.

ఓపెనర్‌గా శిఖర్ ధావన్.. నాలుగో స్థానంలో రాహుల్

ఓపెనర్‌గా శిఖర్ ధావన్.. నాలుగో స్థానంలో రాహుల్

ఎంఎస్కే సూచించిన ప్రకారం.. కోహ్లీ, రోహిత్, ధావన్ జట్టులో ఎంతో అవసరం. వీరిలో ఎవరినీ టీ20 ప్రపంచకప్ జట్టు కోసం వదిలిపెట్టే అవకాశం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం.. చూసుకుంటే ఓపెనింగ్ స్లాట్‌లో శిఖర్ ధావన్‌ను ప్రయత్నించాల్సిందే. ఓపెనర్‌గా శిఖర్‌కు ఉన్న అనుభవం తోడ్పడుతుంది. ఒకవేళ ఓపెనర్‌గా ధావన్ విఫలమైతే.. రాహుల్‌ని ఆ ఆర్డర్లో పంపించవచ్చు. నంబర్ 4 పొజిషన్లో రాహుల్ సాధారణంగా బరిలోకి దిగితే బెటర్. ఎందుకంటే మాంచెస్టర్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో మిడిలార్డర్లో దిగిన రాహుల్ టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు' అని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, May 5, 2022, 12:13 [IST]
Other articles published on May 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+