Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టులకు బుమ్రా ఎంపికవడం వెనుక పెద్ద కథే ఉంది: ఎమ్మెస్కే ప్రసాద్

MSK Prasad Reveals How Jasprit Bumrah Was Selected For Tests || Oneindia Telugu
MSK Prasad opens up on how Jasprit Bumrah was selected for Tests

హైదరాబాద్: ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతని నేతకృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల గురించి మాట్లాడారు. తన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం.

తాజాగా ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఎమ్మస్కే ప్రసాద్ మాట్లాడుతూ "బుమ్రా టెస్టు క్రికెట్ ఆడగలడని చెబితే చాలా మంది నమ్మలేదు. విదేశ్ పర్యటనలకు వెళ్లినప్పుడు బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉంటే అద్భుతాలు చేయగలమని సెలక్టర్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ గ్రహించినప్పుడు... అతడిని ఫిట్‌‌గా ఉండేలా సెట్ చేశాం" అని తెలిపాడు.

ఇందులో భాగంగా "పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చాం. దక్షిణాఫ్రికా సిరిస్‌కు ఎంపిక చేయడానికి ముందు అతడిని రంజీ ఆడేలా చేశాం. అప్పుడే బుమ్రాను టెస్టు సిరిస్‌కు ఎంపిక చేసే ప్రణాళిక సిద్ధమైంది" అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. 2018లో సఫారీగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో బుమ్రా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు.

ప్రస్తుతం బుమ్రా గాయం నుంచి కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి గాయంతో బుమ్రా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు దూరమయ్యాడు. బుమ్రా వెన్ను భాగంలోని ఎముక కొద్దిగా చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే మేల్కొన్న బీసీసీఐ అతడికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాతో సిరిస్‌లకు బుమ్రాను ఎంపిక చేయలేదు.

వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. టీమిండియా తరుపున ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.

హర్దిక్ పాండ్యాకు టెస్టు జట్టులో చోటు కల్పించడంపై ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "హార్దిక్ పాండ్యాకు టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం వెనుక ఓ ప్రణాళిక ఉంది. టీ20 నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి టెస్ట్ క్రికెట్ ఆడగలడా అని చాలా మంది నమ్మలేదు" అని వెల్లడించాడు.

Story first published: Wednesday, November 27, 2019, 17:25 [IST]
Other articles published on Nov 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+