దక్షిణాఫ్రికా vs భారత్: కుల్దీప్, చహల్‌లను ఎందుకు ఎంపిక చేయలేదంటే?

ముంబై: ప్రపంచకప్ అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే ముగిసిన విండీస్ టూర్‌కు యువకులకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కుర్రాళ్లకు చోటిచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్‌లకు టీ20 జట్టులో చోటివ్వలేదు. ఇక త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

యువ క్రికెటర్లను పరీక్షించాలనుకుంటున్నాం:
తాజాగా చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాట్లాడూతూ... 'స్పిన్ బౌలింగ్ విభాగంలో వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరుగున్న టీ20 ప్రపంచకప్ వరకు యువ క్రికెటర్లను పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్, చహల్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి బౌలర్లు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు' అని అన్నాడు.

మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే:
'యువ క్రికెటర్లను కూడా జట్టులోకి తేవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్ బౌలర్‌లు నవదీప్ షైనీ, దీపక్ చాహర్ బాగా రాణించారు. శ్రేయస్ అయ్యర్ కూడా సత్తాను నిరూపించుకున్నాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి ప్రదర్శన చేశారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే కుల్దీప్, చహల్‌లను పక్కకు పెట్టాం' అని ఎంఎస్‌కే తెలిపాడు.

సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చిస్తాం:
తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. త్వరలో జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ టూర్‌లో ఓపెనర్‌గా రాహుల్ పేలవమైన ప్రదర్శన చేయడంతో రోహిత్‌వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications