న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికీ ధోనీనే అత్యుత్తమ ఫినిషర్'

MSK Prasad Defends MS Dhoni's World Cup Show:He Was A Big Strength || Oneindia Telugu
MSK Prasad defends MS Dhonis World Cup show: He was a big strength

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ ఫినిషర్ అంటూ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో ధోని స్థానాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మిడిలార్డర్‌లో సెలెక్టర్లు రాజీ పడ్డారన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

"ఈరోజుకీ నేను ఖచ్చితంగా చెప్పగలుకుతున్నా. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ధోని అద్భుతమైన వికెట్ కీపరే కాదు అత్యుత్తమ ఫినిషర్. మిగిలిన వారంతా ఇంకా పురోగతిలో ఉన్నారు. ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మన్‌గా , వికెట్ కీపర్‌గా ధోని జట్టుకు పెద్ద బలం. ముఖ్యంగా మైదానంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధోని అనుభవం జట్టుతో పాటు కెప్టెన్‌కు ఉపయోగపడింది" అని అన్నాడు.

ప్రపంచకప్‌లో 273 పరుగులు చేసిన ధోని

ప్రపంచకప్‌లో 273 పరుగులు చేసిన ధోని

వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లాడిన ధోని 45.50 యావరేజితో 273 పరుగులు చేశాడు. అంతేకాదు, ప్రపంచకప్‌లో ధోని సెటిల్ అయ్యేందుకే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. దీంతో ధోని బ్యాటింగ్ తీరుపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌లో జడేజాతో కలిసి ధోని ఫరవాలేదనిపించాడు.

సెమీస్‌లో హాఫ్ సెంచరీ

సెమీస్‌లో హాఫ్ సెంచరీ

92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను వీరిద్దరి జోడీ ఆదుకుంది. వీరిద్దరూ కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత జట్టు స్కోరు 208 పరుగుల వద్ద ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ధోని 72 బంతుల్లో 50 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.

వెస్టిండిస్ పర్యటనకు దూరం

వెస్టిండిస్ పర్యటనకు దూరం

ఇదిలా ఉంటే, ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. ధోని వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకుండా రెండు నెలలు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు స్వీకరించాడు.

106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో

106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో

జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు.

Story first published: Wednesday, July 31, 2019, 17:51 [IST]
Other articles published on Jul 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X