Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదు: వరల్డ్‌కప్ జట్టు ఎంపికపై ఎమ్మెస్కే

MSK Prasad confirms IPL performances won’t be considered while choosing Indian squad for World Cup

హైదరాబాద్: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్‌లో అవకాశాలను దక్కించుకుందామనుకున్న యువ ఆటగాళ్ల ఆశలపై టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నీళ్లు చల్లాడు. ఇంగ్లాండ్‌ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్టు ఎంపికపై ఐపీఎల్‌ ప్రభావం ఎంతమాత్రం ఉండదని ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఫిబ్రవరి 15న వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపిక సమయానికి ఐపీఎల్ ప్రారంభమై మూడు వారాలు పూర్తి కానుంది. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు.

"ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వన్డే మ్యాచ్‌లకు ఆటగాళ్లను ఎంపిక చేయడమనేది సరైంది కాదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం. ఐపీఎల్‌కు, వన్డేలకు చాలా తేడా ఉంది. గత నాలుగేళ్లలో భారత ఆటగాళ్లు ఎన్నో వన్డేలతో పాటు బోలెడన్ని టీ20లు ఆడారు. ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు అది సరిపోతుంది" అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.

ఈ అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే తుది జట్టు ఎంపికపై సెలక్టర్లు ఓ అంచనాకు వచ్చేశారు. అయితే, జట్టులో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌పై సందిగ్ధత తొలగిపోలేదు.

Story first published: Tuesday, April 9, 2019, 18:16 [IST]
Other articles published on Apr 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+