Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖరారు కానీ ఏజీఎం: ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదవికాలం పొడిగింపు!

MSK Prasad & Co get extension till next BCCI AGM

హైదరాబాద్: ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని నేషనల్‌ సెలెక్షన్‌ కమిటీ పదవీ కాలం పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజీఎం) వరకూ కొనసాగించాలని బోర్డు గురువారం నిర్ణయించింది.

అయితే ఆ తర్వాతి ఏజీఎం ఎప్పుడు నిర్వహించేది ఖరారుకాని నేపథ్యంలో ప్రసాద్‌, శరణ్‌దీప్‌సింగ్‌, దేవాంగ్‌ గాంధీల కమిటీకి తాత్కాలికంగా కొనసాగింపు లభించింది. మామూలుగా సెలక్షన్‌ కమిటీ పదవీ కాలం ఏడాది మాత్రమే ఉంటుంది.

ప్రసాద్‌, శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీలతో కూడిన సెలక్షన్ కమిటీ పదవీకాలం ఇప్పటికే ఏడాది పూర్తయింది. సాధారణంగా సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 1 నుంచి మొదలై ఆగస్టు 31తో ముగుస్తుంది. మరోవైపు బీసీసీఐ డిసెంబర్‌ 1న ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది.

ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గత సెప్టెంబర్ నుంచి సెలక్టర్లు కాంట్రాక్టు ముగిసిందని అయినా సరే వారికి తాత్కాలిక పొడిగింపు లభించిందని తెలిపారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న జరిగే ఏజీఎంలో 2019 నుంచి 2023 వరకు భారత క్రికెట్‌ జట్టు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జట్టు అయిన కోచి టస్కర్స్‌ కేరళకు ఇవ్వాల్సిన రూ.850 కోట్ల నష్ట పరిహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 11:42 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+