For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఒంటి చేత్తో సిక్సర్: ఐపీఎల్‌లో రికార్డులు బ్రేక్ (Video)

అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సీఎస్కే టాప్-4లోనే కొనసాగుతున్నప్పటికీ తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు తీశాడు.

MS Dhoni s one handed Six Breaks IPL 2022 Season Record for Most Sixes

అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7x4, 3x6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4x4, 4x6) అర్ధశతకాలతో పోరాడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లతో సత్తచాటారు.

ఛేజింగ్‌లో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మిచెల్, అలీ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 57 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ఆ తర్వాత సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఆఖర్లో ధోనీ (26*; 11 బంతుల్లో, 1x4, 3x6) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

ధోనీ ఒంటిచేత్తో రెండు సార్లు బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. అలాగే హెలికాఫ్టర్ షాట్‌తో మరో సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 1063 సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండో సీజన్‌గా ఐపీఎల్-2024 సీజన్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్-2022 సీజన్ 1062 సిక్సర్ల రికార్డును ఈ సీజన్ బ్రేక్ చేసింది.

అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్ల జాబితాలో ఐపీఎల్ -2023 అగ్రస్థానంలో ఉంది. 2023లో 1124 మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుత బ్యాటర్ల జోరు చూస్తుంటే 2023 సీజన్ రికార్డు కూడా బద్దలవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలాలేదు. ఐపీఎల్ 17 ఐపీఎల్ సీజన్లలో చివరి మూడు సీజన్లలో మాత్రమే 1000+ సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు 2018లో 872 సిక్సర్లు టాప్‌గా ఉండేది.

Story first published: Saturday, May 11, 2024, 7:59 [IST]
Other articles published on May 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+