Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తలా ఫర్ ఏ రీజన్.. ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోనీ (Video)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. 2017లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, ఈ నేపథ్యంలో ట్రంప్‌కు దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే ఈ సందర్భంలో ట్రంప్‌కు సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ట్రంప్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఉండటం విశేషం. నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఇద్దరు కలిసి గోల్ఫ్ ఆడారు. గతేడాది ఈ సంఘటన జరిగింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌ను చూడటానికి అమెరికాకు వెళ్లిన ధోనీ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడారు. అనంతరం ఆయనతో ధోనీ సరదాగా ముచ్చటించి ఫొటోలు కూడా దిగారు. దీనికి సంబధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటికి ధోనీ అభిమానులు 'తలా ఫర్ ఏ రీజన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

MS Dhoni s Golf Game with Donald Trump Resurfaces and Goes Viral Post US Polls - WATCH

కాగా, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే పోటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించిన రిటైన్డ్ లిస్ట్‌లో ధోనీ కూడా ఉన్నాడు. 43 ఏళ్ల ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ అయ్యాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. గత అయిదేళ్ల క్యాలెండ్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకోకపోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోవడంతో ధోనీని సీఎస్కే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది.

ఇక ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబె, రవీంద్ర జడేజాలను చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్, ఆల్‌రౌండర్ జడేజాను రూ.18 కోట్లకు, పతిరనా రూ.13 కోట్లకు, దూబె రూ.12 కోట్లకు, ధోనీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది. తన పర్స్ వ్యాల్యూలో సీఎస్కే రూ.65 కోట్లు రిటెన్షన్‌కు ఖర్చు పెట్టి రూ.55 కోట్లు మిగుల్చుకుంది. కాగా, ఈ మొత్తంతో సీఎస్కే మెగా వేలంలో 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో గరిష్టంగా 7గురు విదేశీ ప్లేయర్లకు ఛాన్స్. సీఎస్కేకు ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ మిగిలి ఉంది.

Story first published: Wednesday, November 6, 2024, 20:48 [IST]
Other articles published on Nov 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+