Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దిగ్గజాలను బహిరంగంగా విమర్శించిన ధోనీ.. సెహ్వాగ్ స్ట్రాంగ్ కౌంటర్!

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరొందిన ఎంఎప్ ధోనీ ఓ సందర్భంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ను టీమిండియా నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో సచిన్, సెహ్వాగ్‌తో పాటు గౌతమ్ గంభీర్‌లపై విమర్శలు చేశాడు. ధోనీ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాయి.

ఆ తర్వాత మీడియా సమావేశంలో వీరేంద్ర సెహ్వాగ్ మీడియా వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఈ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ధోనీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. ఆ తర్వాత ధోనీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తర్వాత రానున్న ఐసీసీ టోర్నమెంట్స్‌పై దృష్టిపెట్టాడు.

MS Dhoni s 2012 comments on Sachin Tendulkar and Virender Sehwag sparked controversy in Indian cricket

ఈ క్రమంలో జట్టు పెనుమార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫీల్డింగ్‌లో చురుకుగా ఉండట్లేదనే కారణంగా సెహ్వాగ్, సచిన్‌తో పాటు గంభీర్‌ను క్రమంగా జట్టు నుంచి తప్పించాడు. రొటేషనల్‌ పద్ధతిలో మాత్రమే అవకాశం ఇచ్చాడు. దీని గురించి మీడియా సమావేశంలో ఓ విలేఖరి ధోనీని ప్రశ్నించారు. దానికి ధోనీ కాస్త ఘూటు బదులిచ్చాడు.

సచిన్, సెహ్వాగ్, గంభీర్ ఫీల్డింగ్‌లో చాలా రిలాక్స్‌గా ఉన్నారని, ప్రత్యర్థి బ్యాటర్లు ఈ ఫీల్డర్ల వైపు బ్యాటింగ్ చేస్తూ సునాయాసంగా పరుగులు తీస్తున్నారని ధోనీ అన్నాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లో సెహ్వాగ్ డైవ్ చేస్తూ మెరుపు క్యాచ్ పట్టాడు. అనంతరం మీడియా సమావేశంలో సెహ్వాగ్.. 'నా క్యాచ్ చూశారా? స్లో ఫీల్డర్‌ అని ఎలా అంటున్నారో ఇప్పటికీ తెలియదు' అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై కొన్నాళ్ల పాటు తీవ్రంగా చర్చ సాగింది.

అనంతరం క్రమంగా సీనియర్లు జట్టులో చోటు కోల్పోయారు. ఓపెనర్లుగా రోహిత్ ధావన్, శిఖర్ ధావన్ స్థిరపడ్డారు. 2013లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే 2015లో వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌లో టీమిండియా నిష్క్రమించింది. ఆ తర్వాత 2017లో ధోనీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ తప్పుకున్నాడు.

Story first published: Wednesday, August 21, 2024, 15:57 [IST]
Other articles published on Aug 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+